విజయనగరం జిల్లా జీయమ్మ వలస మండలం చిన కుదుమలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది పుష్పశ్రీవాణిపై టీడీపీ అభ్యర్ధి రామకృష్ణ దాడి చేయటంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు లేక పోవటంతో ప్రజలే ఆమెకు రక్షణగా నిలబడ్డారు. ఇక్కడ ఏకపక్షంగా టీడీపీ ఓటింగ్ కు పాల్పడుతోందని తెలిసి పరిశీలించేందుకు వెళ్లిన అరుకు వైసీపీ ఎంపీ అభ్యర్ధి శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా ఎలా వస్తారని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు ఆయన్ను నిర్భందించాయి. విషయం తెలుసుకుని పోలింగ్ బూత్ కు చేరుకున్న వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్ధి పుష్ప శ్రీవాణి పై కూడా టీడీపీ నేత రామకృష్ణ దాడి చేసి ఆమెను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆమెకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి సురక్షిత ఫ్రాంతానికి తరలించారు.