ఘనంగా ‘మే మాలి’ 55th బర్త్ డే..

  • Publish Date - September 10, 2020 / 03:42 PM IST

హిప్పోపోటమస్ కు పుట్టిన రోజు..అదికూడా 55వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. థాయిలాండ్‌లో ‘మే మాలి’ అనే పేరున్న ఆడ నీటిగుర్రం 55వ పుట్టిన రోజుని జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. పండ్లు..కూరగాయలతో కేకు రూపంలో పేర్చి దానికి హిప్పోపోటమస్ కు పెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం బ్యాంకాక్‌లోని జూనుంచి తూర్పు థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూకు ‘మే మాలి’ని తీసుకొచ్చారు.ఇప్పుడు మేమాలి వయసు 55 సంవత్సరాలు. హిప్పోపోటమస్ లు 40 నుంచి 50 సంవత్సరాలు జీవిస్తాయి. కానీ మే మాలి ఏకంగా 50 దాటటమ కాదు 55ఏళ్లపాటు జీవించి ఉండటం విశేషం. మే మాలి అంటే థాయ్ భాషలో “మదర్ జాస్మిన్” అని అర్థం.


“మే మాలి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. దీంతో మేమాలి ఆరోగ్యం, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది తిరగానికి అవసరమయ్యే వాతావరణం విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం జూ అధికారులు.
దీని గురించి జూ డైరెక్టర్ అట్టపోర్న్ శ్రీహైరున్ మాట్లాడుతూ..మేమాలి ఇప్పటి వరకూ 21 పిల్లలకు జన్మనిచ్చిందనీ తెలిపారు. దీనికి పుట్టిన హిప్పోలు ఆగ్నేయాసియా దేశాల్లోని వివిధ జంతుప్రదర్శనశాలల్లో ఉన్నాయి. అవి బాగా పెద్దవయ్యాయని తెలిపారు. మేమాలి ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే హిప్పోపొటామస్ లో ఒకటి అని తెలిపారు.



ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల నదులు, సరస్సులలో నీటిగుర్రాలు ఎక్కువగా నివసిస్తుంటాయి. అడవిలో నివసించేవి వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఫిలిప్పీన్స్లో ఎక్కువ కాలం జీవించిన హిప్పోగా పేరున్న బెర్తా అనే నీటిగుర్రం.. 2017లో 65 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఫ్లోరిడాలోని వన్యప్రాణి పార్కులో నివసిస్తున్నమరో హిప్పోపొటామస్ లూసిఫర్.. ఈ ఏడాది జనవరిలో తన 60 వ పుట్టినరోజును జరుపుకుంది. పెద్ద హిప్పోలు 1,500కిలోల(3,304 పౌండ్లు) నుంచి 3,200 కిలోల వరకు బరువుంటాయి. ఇవి ఏనుగు తరువాత భూమిపై నివసించే రెండవ భారీ జంతువులు.



https://10tv.in/this-worlds-largest-camera-takes-3200-megapixel-photos/
వేడిని తట్టుకోలేని ఈ హిప్పోపోటమస్ లు ఎక్కువగా నీటిలో గడుపుతాయి. అందుకే వీటిని నీటి గుర్రాలని అంటారు. ఇవి పూర్తిగా శాఖాహారులు. గడ్డి, పండ్లను తినడానికి రాత్రి ఒడ్డుకు చేరుకుంటాయి. ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం అడవుల్లో నివసించే నీటిగుర్రాల సంఖ్య కేవలం 1,15,000 నుంచి 1,30,000 వరకు మాత్రమే.