మోడీ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మ : జహీరాబాద్ లో రాహుల్ 

  • Publish Date - April 1, 2019 / 08:32 AM IST

అబద్దాలు చెప్పటంలో  మోడీ సిధ్దహస్తుడంటూ మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన పార్టీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం అని భరోసా ఇచ్చారు.  అధికారంలోకి రాగానే 5 కోట్ల పేదవారి ఖాతాలో ఏడాదికి 72 వేల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు.  
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు

రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో అనిల్ అంబానీ లాంటి వారికి లాభం చేకూర్చారని రాహుల్ ఆరోపించారు. చౌకీదారునంటూ చెప్పుకునే మోడీ అనిల్ అంబానీ, మోహిల్ చౌక్సీ, నీరవ్ మోడీలకి చౌకీదారుగా ఉన్నాడని ఆరోపించారు. నల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని చెప్పి, రాత్రికి రాత్రే 500, వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేశారు, కానీ నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కు రాలేదని రాహుల్ అన్నారు.

మీరు టీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్లేనని రాహుల్ అన్నారు. కేసీఆర్ పార్లమెంట్ లో మోడీకి మద్దతు తెలిపారని, గబ్బర్ సింగ్ టాక్య్(GST) విషయంలో కేసీఆర్ మోడీని సమర్ధించారని చెప్పారు. టీఆర్ఎస్ రిమోట్ మోడీ చేతిలో ఉందని రాహుల్ తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యాగాలిస్తామన్న మోడీ నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని, దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా పరిశ్రమలుస్ధాపించే వారికి 3 ఏళ్లు రాయితీలు కల్పిస్తామని రాహుల్ చెప్పారు. 
Read Also : మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న