Mamata Banerjee: రోడ్డు పక్కన కాన్వాయ్ ఆపి.. హోటల్లో కస్టమర్లకు వడలు అందించిన సీఎం మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి ఓ చిన్న హోటల్ కు వెళ్లారు. అనంతరం అక్కడున్న వారికి వడలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ మమతా బెనర్జీ చాలాసార్లు ఇటువంటి పనులు చేశారు.
- T Venkateshwarlu
- Published on- November 16, 2022 / 07:42 AM IST
CM Mamata Banerjee
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి ఓ చిన్న హోటల్ కు వెళ్లారు. అనంతరం అక్కడున్న వారికి వడలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ మమతా బెనర్జీ చాలాసార్లు ఇటువంటి పనులు చేశారు.
తాజాగా, ఝాడ్గామ్ మీదుగా కాన్వాయ్ లో మమతా బెనర్జీ వెళ్తున్నారు. రోడ్డు పక్కన ఆమెకు ఓ చిన్న హోటల్ కనపడింది. దీంతో అక్కడ తన కాన్వాయ్ ను ఆపాలని చెప్పారు. నేరుగా హోటల్ లోకి వెళ్లి అక్కడున్న కస్టమర్లకు న్యూస్ పేపర్ లో వడలు పెట్టి ఇచ్చారు. ‘‘ప్రతి ఒక్కరికీ వడలు వచ్చాయా?’’ అని మమతా బెనర్జీ అడిగారు.
ఝాడ్గామ్ లో గిరిజనులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం మమతా బెనర్జీ ఇలాగే రోడ్డు పక్కన ఉన్న ఓ స్టాల్ లోకి వెళ్లి మోమోస్ తయారు చేశారు. అప్పట్లో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
