ఓ సాధారణ రైతుబిడ్డ జపాన్ కు ప్రధాని అయ్యారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యోషిహిడే సుగా జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. జపాన్ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగాను సోమవారం (సెప్టెంబర్ 14,2020) అక్కడి అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డిపి) ఎన్నుకుంది. ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో సుగా 377 ఓట్లు సాధించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు. సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు. 71 ఏళ్ల సుగా..మాజీ ప్రధాని షింజో అబేకు చాలా విశ్వాసనీయమైన వ్యక్తి అనే పేరుంది.
సుగా తండ్రి స్ట్రాబెర్రీ పండ్ల వ్యవసాయం చేసేవారు.ఉత్తర జపాన్‌లోని గ్రామీణ అకితాలో పెరిగారు. అతని బాల్యం అంతాదాదాపు అక్కడే గడిచింది. హైస్కూలు చదువు పూర్త అయ్యాక జపాన్ రాజధాని టోక్యోకు వచ్చారు. అలా అంచలంచెలుగా ఎదురుగుతూ..యోకోహామాలో మునిసిపల్ అసెంబ్లీ సభ్యునిగా 1987 లో తన మొదటి కార్యాలయానికి ఎన్నికయ్యారు. అంతకు ముందు సుగా నైట్ కాలేజీలో చేరడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి మాజీ ప్రధాని అబే విశ్వసాన్ని చూరగొన్నారు.
https://10tv.in/manholes-with-led-lights-in-a-japan-town-get-glowing-anime-makeover/
అసమానతలను ధిక్కరించి అబే 2012 లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, సుగాను శక్తివంతమైన చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా నియమించారు. దీంతో చక్కటి సలహాలు ఇస్తూ అబేకు వెన్నుదన్నుగా నిలిచారు సుగా. అతని సలహా మేరకు అబే విదేశీ కార్మికులపై ఆంక్షలను సడలించడం వంటి పలు కీలకమైన పనులు చేశారు. అబే విధానాలలో ఇది మైలురాయి గా నిలిచిపోయిదని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.అబే ఆలోచనలు…విధి విధానాలను ముందుకు తీసుకురావడానికి సుగా చాలా కృషి చేశారని చెబుతుంటారు.
ఈ సందర్భంగా సుగా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కృషి చేస్తానని..ఈ క్రమంలో పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటానికి నా తక్షణ ప్రాధాన్యమని తెలిపారు. సుగా స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చారు.ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. మాజీ ప్రధాని షింజో అబె మరో ఏడాదిపాటు పదవీకాలం మిగిలుండగానే అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.
గత కొంతకాలంగా ఆయన పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలనే తాను నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. అనారోగ్యం కారణంగా ఆత్మవిశ్వాసంతో పాలన కొనసాగించే స్థితిలో నేను లేనని..ఈ కరోనా విపత్కర సమయాల్లో ఆరోగ్యవంతుడైన..శక్తివంతమైన ప్రధాని దేశానికి అవసరమని పేర్కొన్నారు. షింజో అబె జపాన్ ప్రధానిగా అత్యధికకాలం పాలించిన నేతగా రికార్డును నెలకొల్పారు.