స్విట్జర్లాండ్‌లోని జెనీవా సదస్సులో తెలంగాణ నేతన్న

  • Publish Date - October 9, 2019 / 01:35 AM IST

అంతర్జాతీయ కాటన్ దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా సదస్సులో వరంగల్ నగరంలోని కొత్తవాడ చేనేత కార్మికునికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణలో చేనేత ఉత్పత్తుల తయారీలో భాగమైన నూలు వడికే దర్రీ రాట్నంను దేశం తరఫున ప్రదర్శించారు పిట్ట రాములు.

వరల్డ్ ట్రేడ్ ఆర్డనైజేషన్ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశం నుంచి ఈ ఏడాది వరంగల్ కొత్తవాడకు చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత పిట్ట రాములు వెళ్లారు. నూలు వడికె రాట్నాన్ని అక్కడికు తీసుకుని వెళ్లారు.

సదస్సుకు భారత్ తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరవగా.. నూలుతో భారత్‌లో తయారు చేస్తున్న వస్ర్తాలతోపాటు కొత్తవాడలోని ఉత్పత్తులైన దర్రీస్, బెడ్‌షీట్ల అక్కడివారికి వివరించారు.