టీడీపీలో ముసలం: బైబై బాబు అంటున్నారు

  • Publish Date - May 3, 2019 / 07:14 AM IST

తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందని, ఆ పార్టీలో రెండవ వర్గం తయారైందని, దీంతో పార్టీకి, చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీలోనే కొందరు నేతలు బైబై బాబు అంటున్నారని ఆరోపించారు. బాంబేలో ఒక ఇల్లీగల్ సంస్థ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అంటుంది. అంటూ ఓ ముఖ్యమంత్రి అన్నాడంటే ఎంత దిగజారుడు తనమో అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ముంబైలోని సత్తా మార్కెట్‌లో టీడీపీ గెలుస్తుందని పందేలు కడుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బ్లాక్ మార్కెట్ గురించి మాట్లాగడడం దారుణం అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తులే ఉంటే భవిష్యత్ ఏమైపోతుంది అనే ఆందోళన కలుగుతుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇలా మాట్లాడడం ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని.. వెంటనే చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రికెట్ బెట్టింగ్‌లో ఉన్నారంటూ అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డిరు.