వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ బాణం.. చెల్లెలు వైఎస్ షర్మిల ఆ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. మార్చి 29వ తేదీ నుంచి వారు ఎన్నికల ప్రచారంను ఉదృతం చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో ఇవాళ(2019 మార్చి 28) వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులు అర్పించి ప్రచారంకు శ్రీకారం చుట్టనున్నారు. 29న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
30న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లోనూ.. 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ విజయమ్మ ప్రచారం చేస్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల 29న నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోకవర్గం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. దీంతో ఆమె తొలి టార్గెట్ లోకేష్ కానున్నారు. 30న గూంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ.. 31న గంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోనూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.