Viral Video
Viral Video: షూటింగ్ తీయాలంటే అందుకోసం ఖరీదైన పరికరాలు ఉండాలని, లేదంటే ఒక్క సీను కూడా తీయలేమని చాలా మంది భావిస్తుంటారు. అయితే, సృజనాత్మకత, ఆలోచనాశక్తి ఉంటే ఖర్చు లేకుండానే షూటింగ్ తీయవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. తాజాగా, ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇందులో కొందరు పిల్లలు చెప్పులతో క్లాప్ కొట్టి, స్మార్ట్ ఫోన్ లో సీన్ చిత్రీకరించారు. కెమెరాను, కెమెరామన్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఏ పరికరాన్నీ ఉపయోగించలేదు. కెమెరామన్ అడ్డం పడుకుని సీన్ తీస్తుండగా అతడి కాళ్లు పట్టుకుని మరో ఆ బాలుడు ముందుకు లాగుతూ తీసుకెళ్లాడు. దీంతో, నటుడు నడుస్తుండగా అతడి కాళ్లను షూటింగ్ తీశాడు కెమెరామన్. ఆంధ్రప్రదేశ్ లో ఈ షూటింగ్ తీశారు.
కేవలం రూ.1600 బడ్జెట్ తో సినిమా తీస్తే ఇలా ఉంటుందని ఒకరు ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా లైక్ చేశారు. దాదాపు 6 లక్షల మంది ఇప్పటికే ఈ వీడియోను చూశారు. ట్విట్టర్ లోనే కాకుండా వాట్సాప్ లోనూ ఈ వీడియో వైరల్ అవుతోంది.
When your movie budget is $20 pic.twitter.com/OdBmW4I9VL
— The Figen (@TheFigen_) February 18, 2023