Viral Video: రైలులో బాలుడి సంగీత కచేరీ.. ఆనంద పారవశ్యంలో మునిగిన ప్రయాణికులు

ఎనిమిదేళ్ల బాలుడు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించాడు. ఇంకేముందీ.. రైలులోని వారంతా అతడి చుట్టూ చేరి ఆ సంగీతాన్ని వింటూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఇతర కంపార్ట్ మెంట్ల నుంచి కూడా వచ్చి ఆ బాలుడి సంగీతాన్ని విని ఆనందించారు.

Viral Video: సంగీతానికి భాషా భేదం లేదు. అది అందరినీ అలరిస్తుంది. మన హృదయాన్ని కదిలిస్తుంది. విభిన్న భాషల ప్రజలను సంగీతం ఏకం చేస్తుంది. మానసిక రోగాలకు చక్కని సంగీతమే విరుగడని అంటారు. రైలు ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలు, భాషల వారు కలుస్తుంటారు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవచ్చు. కానీ, అందరికీ మ్యూజిక్ మాత్రం సుపరిచితమే. ఈ అంశాలన్నింటినీ గుర్తు చేస్తూ తాజాగా ఓ రైలులో ఓ ఘటన చోటుచేసుకుంది.

తాజాగా, ఎనిమిదేళ్ల బాలుడు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించాడు. ఇంకేముందీ.. రైలులోని వారంతా అతడి చుట్టూ చేరి ఆ సంగీతాన్ని వింటూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఇతర కంపార్ట్ మెంట్ల నుంచి కూడా వచ్చి ఆ బాలుడి సంగీతాన్ని విని ఆనందించారు. ఆ బాలుడి ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సంగీత వారియర్ అనే యూజర్ ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘చెన్నైకు చెందిన సూర్యనారాయణ్ అనే బాలుడు రైలులో అప్పర్ బెర్త్ లో కూర్చొని శాస్త్రీయ సంగీత కచేరి చేశాడు’’ అని పేర్కొన్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యులు కాశీ తమిళ సంఘానికి చెందిన వారుగా తెలుస్తోంది.

Tamilnadu: ‘దొంగ’ భర్త కోసం కోర్టులోనే విషం తాగిన 17 ఏళ్ల యువతి