Viral Video
Viral Video: రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి డ్యాన్స్ చేసింది. ఆ పాప వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పాప ఎవరో కాదు.. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ టీవీ షో పోటీలో పాల్గొన్న ఆధ్యాశ్రీ ఉపాధ్యాయ. 7 ఖూన్ మాఫ్ సినిమాలోని డార్లింగ్ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.
ఆ పాపకు ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా, ఆమె రైల్వే స్టేషన్ కు వెళ్లిన సమయంలో అక్కడ కూడా డ్యాన్స్ చేసింది. అందరినీ ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసి వీడియో తీసుకుని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా యూజర్లు చూశారు.
అలాగే, ఈ వీడియోకు 31,000 లైకులు వచ్చాయి. చిన్న వయసులోనే అభిమానులను సంపాదించుకున్న ఆధ్యాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన పాత వీడియోలను కూడా చూస్తున్నామని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. టీవీలో అదరగొట్టిన ఆధ్యా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ తన డ్యాన్స్ తో అందరినీ అలరిస్తోందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.