Auto on Railway Station platform: రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నంబరు-1పైకి ఆటోను తీసుకొచ్చిన డ్రైవర్

రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలోకి ఆటోను తీసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చివరకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో ప్రవేశపెట్టారు. కుర్లా ఆర్పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లోకి అక్టోబరు 12న అర్ధరాత్రి దాటాక ఓ డ్రైవర్ తన ఆటోను తీసుకొచ్చాడు. ప్లాట్ ఫాం నంబరు 1పైకి అతడు ఆటో తీసుకురాగానే అక్కడున్న వారు అభ్యంతరాలు తెలిపారు. వెంటనే ఆటోను అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు పక్కకు తీసుకువెళ్లి, దాన్ని సీజ్ చేశారు.

Auto on Railway Station platform: రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలోకి ఆటోను తీసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చివరకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో ప్రవేశపెట్టారు. కుర్లా ఆర్పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లోకి అక్టోబరు 12న అర్ధరాత్రి దాటాక ఓ డ్రైవర్ తన ఆటోను తీసుకొచ్చాడు.

ప్లాట్ ఫాం నంబరు 1పైకి అతడు ఆటో తీసుకురాగానే అక్కడున్న వారు అభ్యంతరాలు తెలిపారు. వెంటనే ఆటోను అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు పక్కకు తీసుకువెళ్లి, దాన్ని సీజ్ చేశారు. అతడు ఆటోను స్టార్ట్ చేసే సమయంలో పొరపాటున ప్లాట్ ఫాంపైకి దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి కోర్టు శిక్ష విధించింది.

కాగా, ఆ ఆటోడ్రైవర్ రైల్వే స్టేషన్లోని ఆటోను తీసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరిగితే ప్రాణనష్టం జరిగే ముప్పు ఉంటుందని కొందరు కామెంట్లు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..