నెదర్లాండ్స్‌లోని ఒక రహదారిపై వన్యప్రాణుల వంతెన గురించి మట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ వంతెన జంతువుల వలస నమూనాలు ఏ విధంగానూ అడ్డుపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అభివృద్ది చేశారు. ఈ వంతెన నిర్మాణం కోసం ఏ వన్యప్రాణికీ హాని జరగకుండా ఏవిధంగా కట్టారో ఫోటో చూస్తే అర్థమవుతుంది.
జంతువులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ…అలా జరగకుండా జంతువులు సురక్షితంగా చాలా ప్రశాంతంగా…హాయిగా..తాపీగా రోడ్డు దాటటానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం చక్కటి ప్లాన్ వేసింది. హైవేపై గ్రీనరీని ఏర్పాటు చేసింది. దీంతో రోడ్డు దాటాలనుకునే జంతువులు ఎటువంటి ప్రమాదానికి గురికావు..క్షేమంగా రోడ్డు దాటేలా ‘గ్రీన్ హైవే’ను ఏర్పాటు చేశారు. ఫోటో చూస్తే వన్యప్రాణుల గురించి నెదర్లాండ్ అధికారులు ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది.
వంతెన గురించి మట్లాడుతూ హైవేపై ఈ గ్రీనరీ వంతెనకు సంబంధించిన ఫోటో కొంతకాలంగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేశారు.
భారతదేశంలో కూడా ఇటువంటి మోడళ్ల కోసం నితిన్ గడ్కరీని కోరుతూ..ఆనంద్ మహేంద్రా దీన్ని షేర్ చేశారు. దీనిపై రహదారుల మంత్రి రోడ్డు రవాణా గురించి సానుకూలంగా స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని సియోని, నాగ్‌పూర్ మధ్య ఎన్‌హెచ్ 44 లో జంతు కారిడార్ ఎలా తయారైందో ‘మంచి ఫలితాలతో’ గడ్కరీ హైలైట్ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. “మనిషి, జంతువుల మధ్య శాంతియుత సహజీవనం కోసం మేం మా లక్ష్యం కొనసాగిస్తామని తెలిపారు.
The perfect way to coexist. @nitin_gadkari ji if you can make this a standard feature when building highways through particular zones, we will give you a standing ovation! https://t.co/vEN0FeIcLN
— anand mahindra (@anandmahindra) August 29, 2020