గొప్ప మనసు : చెవులు వినిపించని వ్యక్తికి ఆనంద్ మహీంద్రా సాయం

  • Publish Date - January 14, 2020 / 09:28 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోని చూసి, ఆ వ్యక్తి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

సూరత్ లోని విష్ణు పటేల్ అనే వ్యక్తి అందరు వాడి పారేసిన ఎలక్ట్రినిక్ వస్తువుల భాగాలను ఉపయోగించి వాహనాలను తయారు చేసేవాడు. చిన్నప్పటి నుంచి వినికిడి వినిపించని అతను ఈ వృత్తిని జీవనాధారంగా  చేసుకున్నాడు.
 
పటేల్ ఓ స్ధానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో  ఏడు బ్యాటరీలతో పనిచేసే బైక్ ను తయారు చేశానని, పర్యావరణానికి హాని కలిగించదని చెప్పాడు. తాను ప్రజలు వాడి పారేసిన వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించి బైక్ లను తయారు చేస్తుంటానని తెలిపాడు. దివ్యాంగుల కోసం 3 వీలర్ ను తయారు చేయాలనుకుంటున్నాను, వారి కుటుంబాలను కూడా ఒకేసారి తీసుకువెళ్ళగల సామర్ధ్యం ఉన్నదని ఆయన తెలిపారు.

ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్ చేసిన పోస్టుకు స్పందింస్తూ.. పటేల్ కథ ఎంతో నచ్చిందని తెలిపారు. పటేల్ వర్క్ షాప్ అప్ గ్రేడేషన్లలో పెట్టుబడుల గురించి అతనితో చర్చిస్తాను అని మహీందా తెలిపారు. పటేల్ లాంటి వ్యక్తులకు పెట్టుబడులు పెట్టడానికి రూ.1 కోట్లు నిధిని కేటాయించడానికి ప్రేరణనిచ్చిందని అన్నారు.