Delhi ఉద్యమంలో అలసిపోతున్న రైతుల కోసం ‘ఫ్రీ’ మసాజ్ సెంటర్లు : అన్నంపెట్టే అయ్యలకు మద్దతు
- nagamani
- Published On : December 12, 2020 / 01:23 PM IST
Delhi : Protesting Farmers Foot Massagers : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఉద్యమానికి ఎంతోమంది మద్దుతు తెలుపుతున్నారు. రైతుల ఉద్యమానికి ఎన్నోసంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈక్రమంలో రైతుల కోసం ఇంటర్‌నేషనల్ ఎన్‌జీవో ఖాల్సా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజంతా ఉద్యమంలో నినాదాలు చేసి..నడుస్తూ నిరసనలు చేసి అలసిపోయిన రైతన్నలు సాయంత్రం అయ్యేసరికి అలసిపోతున్నారు.
ప్రపంచానికే అన్నం పెట్టే రైతన్నల గోడు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటంలేదు. అయినా సరే పలురాష్ట్రాలకు చెందిన రైతులంతా ఒకేమాట, ఒకేబాట, ఒకే నినాదం అంటూ ఉద్యమాన్ని తీవ్ర తరంచేస్తున్నారు. అలా ఉద్యమంలో అలసిపోయిన వృద్ధ రైతన్నల కోసం ఇంటర్‌నేషనల్ ఎన్‌జీవో ఖాల్సా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
‘సింగూ సరిహద్దు వద్ద నిరసన చేస్తూ అలసిపోయిన వృద్ద రైతుల కోసం మా వంతు భాద్యతగా వారి కోసం ‘‘ఫుట్ మసాజ్ సెంటర్ల’’ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జాతీయ రాజధాని ప్రాంతంలోని సింగు సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్న రైతులకు శుక్రవారం ఇంటర్‌నేషనల్ ఎన్‌జీవో ఖాల్సా మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
‘‘రైతుల ఉద్యమానికి మావంతుగా మద్దుతు తెలపాలనుకున్నాం..వారి కోసం ఏదైనా సహాయం చేయాలనుకున్నామనీ అందుకే ఉద్యమంలో అలసిపోతున్న రైతుల కోసం మా వంతు భాద్యతగా ‘‘ఫుట్ మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేశాం‘‘అని ఖాల్సా మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌ప్రీత్ ఓ ప్రకటనలో తెలిపారు. అలసిపోయిన రైతుల కాళ్లను సేదతీరుస్తాని తెలిపారు. వీటితో పాటు 400 వాటర్‌ప్రూఫ్ టెంటులు, గ్లిసరిన్ సదుపాయం గల బాత్‌రూంలు ఏర్పాటు చేశామని తెలిపారు.
తేజిందర్ పాల్ సింగ్ అనే వాలంటీర్ మాట్లాడుతూ…ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చిన రైతులకు మొదటి రోజు నుంచి అందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామనీ..ఢీల్లీలో చలినుంచి రక్షించడానికి దుప్పట్లను రైతులకు 10 ట్రక్కుల దుప్పట్లు తెచ్చామని తెలిపారు. చాలాదూరం నుంచి ప్రయాణించి అలసిపోయిన రైతులకు ఫుట్ మసాజ్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయనీ..అలసిపోయినవారికి మసాజ్ చేస్తు ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు. అన్నదాతలకు ఇటువంటి సేవలు అందిస్తుండటంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తేజిందర్ తెలిపారు.
ఫుట్ మసాజ్ లపై రైతులు మాట్లాడుతూ..చాలా దురం నుంచి ప్రయాణం చేసి ఢిల్లీకి వచ్చిన మాకోసం ఎంతోమంది మద్దతుగా ఉండటం చాలా సంతోషంగా ఉందనీ..ఫుట్ మసాజ్ సెంటర్‌ల వల్ల సేదతీరుతున్నామని తెలిపారు.
కాగా ప్రభుత్వం రైతులతో జరుపుతున్న చర్చలకు రైతు సంఘాలు ఏమాత్రం అంగీకరించటంలేదు. చట్టాలను రద్దు చేయాలను డిమాండ్ మీదనే నిలబడ్డారు. రైతులకు నష్టం కలిగించే ఏ చట్టాలు మాకొద్దనీ నినదిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది.
ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. మూడు కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ భాను(బీకేయూబీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
This Picture gives me more confidence ?❤️#FarmersProtest pic.twitter.com/bTutef44yt
— Aʙᴅᴜʟ Mᴀᴀʟɪᴋ (@iamabdulmaalik) December 10, 2020
