ఏనుగు వైరల్ వీడియో: ఇష్టమైన ఫుడ్ దొరికితే మనసు ఆగుతుందా?
- veegam team
- Published On : February 15, 2020 / 07:13 AM IST
ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. థాయ్ లాండ్ లో రెండు ఏనుగులు రోడ్డు మధ్యలో చెరకు గడ్డలను తినే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోని సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు.
ధాయ్ లాండ్ లోని నాఖోన్ సావాన్ ప్రదేశానికి రెండు ఏనుగులను ట్రక్కులో తీసుకుళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగిపోయాయి. అదే సమయంలో ఆ రెండు వాహానాలకు ప్రక్కగా ఓ చెరకు లారీ వచ్చి ఆగింది. ఏనుగులకు చెరకు ప్రియమైన ఆహారం కావటంతో లారీని గమనించిన ఏనుగులు వెంటనే రంగంలోకి దిగి చెరుకు గడ్డలను అదే పనిగా తొండంతో లాగి తింటున్నాయి. ఎంతో ఇష్టమైన ఆహారం దొరకటంతో అందిన కాడికి తొండంతో లాగి తింటు ఎంజాయ్ చేస్తున్నాయి.
ఏనుగులకు చెరకు ఎంతో ఇష్టమైన ఆహారంలో ఒకటి. ఇది ఒక రుచికరమైన లంచ్ బ్రేక్ అనే క్యాప్షన్ తో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్ చేస్తూ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోని లక్షకు పైగా వీక్షించారు. 13 వేలకు పైగా లైక్ వచ్చాయి. వావ్… బ్రేక్ ఫాస్ట్ అనేది రోడ్డు మధ్యలోనే జరిగింది. దేవునికి ధన్యవాదాలు, వారు ఇంకా చక్కెరను పోగొట్టుకోవడం గురించి ఆలోచించటం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Delicious lunch break ?
Sugarcane is one of favourite food of elephants. In captivity sugarcane is an integral part of the diet plan. To provide energy. pic.twitter.com/IsjJDQCx2k— Susanta Nanda IFS (@susantananda3) February 13, 2020
