Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఆగని డ్యాన్స్‌ల హంగామా.. భోజ్‌పురీ సాంగ్‌కి అమ్మాయి డ్యాన్స్ వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఏదో ఒకటి చేసి జనాల దృష్టిలో పడాలనే ఆసక్తి ఎక్కువవుతోంది. సోషల్ మీడియాని అందుకు బాగానే ఉపయోగించుకుంటున్నారు. నిబంధనల్ని అతిక్రమించి మరీ తాము అనుకున్నది చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్‌ల హంగామా కొనసాగుతోంది. తాజాగా ఓ అమ్మాయి చేసిన సాంగ్ వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published On : April 6, 2023 / 01:28 PM IST
Delhi Metro
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో (delhi metro) డ్యాన్స్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. మెట్రోలో ఇలాంటివి నిషిద్ధమని అధికారులు మొత్తుకుంటున్నా ప్రయాణికుల (passengers) చెవికెక్కడం లేదు. తాజాగా ఓ మహిళ భోజ్‌పురీ పాటకి (Bhojpuri song) చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.
Upasana : దుబాయ్‌లో ఉపాసనకి సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో!
ఇటీవల కాలంలో ఏదో ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకోవడం అక్కడ డ్యాన్సింగ్ వీడియోలు చేయడం కామనైపోయింది. అందుకు మెట్రో స్టేషన్లు కూడా వేదికలుగా మారుతున్నాయి. మెట్రోల్లో ఫన్నీ రీల్స్ (reels) , డ్యాన్స్ లు చేయడం వాటిని వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ తతంగాలన్నీ చివరికి మెట్రో అధికారుల వరకూ చేరి మరోసారి వార్నింగ్‌లు ఇచ్చినా.. ఇవేమీ తమకు పట్టనట్లు ప్రయాణికులు తమ పని తాము చేసుకుపోతున్నారు.
old lady dance video viral : సంతోషంగా డ్యాన్స్ చేసిన వృద్ధురాలు.. ఫిదా అవుతున్న జనం వీడియో వైరల్
తాజాగా Avnikarish అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రెడ్ శారీ ధరించి మెట్రో ప్లాట్ ఫాం మీద డ్యాన్స్ చేస్తున్న ఓ మహిళ వీడియోని షేర్ చేసింది. మెట్రో దగ్గర డ్యాన్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలంటూ తన అభిప్రాయాన్ని కూడా రాసింది. “సజ్ కే సవార్ కే” (Saj Ke Sawar Ke) అంటూ సాగే భోజ్‌పురి పాటకి చిందులు వేసిన ఈ అమ్మడికి నిజంగా గట్స్ ఉన్నాయని కొందరు .. రూల్స్ కి విరుద్ధంగ అలా డ్యాన్స్ లు చేస్తూ ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం రాంగ్ అని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
