marriage breakup : విడిపోయిన కొత్త జంట.. పెళ్లికూతురు చేసిన పని తెలిస్తే షాకవుతారు
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇక పెళ్లైనా కలిసి జీవించడానికి కూడా విధి రాతలో ఉండాలి కదా.. అప్పుడే పెళ్లితో ఒకటైన జంట పెళ్లి వేదికపైనే విడిపోయారు. కారణం తెలిస్తే షాకవుతారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published On : April 8, 2023 / 12:01 PM IST
marriage breakup
marriage breakup : చాలా సినిమాల్లో పెళ్లి పీటలపై పెళ్లి (marriage) ఆగిపోయిన సీన్స్ చూస్తుంటాం. అయితే రియల్ లైఫ్‌లో ఎంతో సంతోషంగా ఒక్కటి కావాల్సిన జంట పెళ్లి వేదికపై ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. చూసిన వారంతా షాక్ కి గురయ్యారు. అసలింతకీ పెళ్లి రిసెప్షన్‌లో ఏం జరిగింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.
old lady dance video viral : సంతోషంగా డ్యాన్స్ చేసిన వృద్ధురాలు.. ఫిదా అవుతున్న జనం వీడియో వైరల్
చైనాలో (china) ఓ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. అందరూ అందంగా ముస్తాబయ్యారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న వధూవరులిద్దరూ స్టేజీపైకి నడుచుకుంటూ వచ్చారు. ఎప్పటికీ మేము సంతోషంగా కలిసి ఉంటామని వారిద్దరూ చెప్పాల్సిన సందర్భంలో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. అప్పటిదాకా వధూవరులిద్దరి వీడియో స్క్రీన్ మీద ప్లే అవుతుండగా హఠాత్తుగా పెళ్లికూతురు (bride) మరొకరితో సన్నిహితంగా ఉన్న వీడియో ప్లే అయ్యింది. అంతే అందరూ షాకయ్యారు. ఇంతకీ ఆ వీడియో ప్లే చేయించింది పెళ్లికొడుకే (bridegroom). ఆ వీడియో ప్లే కాగానే పెళ్లికొడుకు ఒక్కసారిగా ఆమెను స్టేజ్ పై నుంచి నెట్టబోయాడు. ఆమె తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే అతని మీదకు విసిరింది. అక్కడ ఉన్నవారంతా వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించారు. ఇలా పెళ్లిమండపంలో గందరగోళం చెలరేగింది.
Priyanka chopra : ప్రియాంక చోప్రాని అబ్బాయిలా ఓసారి ఊహించండి.. ఆర్టిస్ట్ వీడియో వైరల్
పెళ్లికూతురికి తన దగ్గర బంధువుతో అఫైర్ ఉందంటూ పెళ్లికొడుకు ఈ పెళ్లిని రిజెక్ట్ చేశాడు. ఆ విషయాన్ని బహిర్గతం చేసాడు. ఎంతో సంతోషంగా పెళ్లి జరగాల్సిన రిసెప్షన్ (reception) వేడుక కాస్త ఈ సంఘటనతో గరం గరంగా మారింది. వేడుకకు వచ్చిన వారంతా షాకయ్యారు. ఇది జరిగి చాలాకాలం అయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు విషయం తెలిసి పెళ్లికొడుకు ఎందుకు పెళ్లికి సిద్ధపడ్డాడు? అని ప్రశ్నిస్తే అతని మంచికే జరిగిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
姐夫门:新郎婚礼现场播放新娘和姐夫啪啪影片? pic.twitter.com/wLy8mjWXIy
— ㊙️绿帽社? (@lvmaoshetuite) December 27, 2019
