వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి క్షేమం..

  • Publish Date - October 14, 2020 / 10:13 PM IST

Hyderabad floods : హైదరాబాద్ హస్మత్ పేట్‌లో కొట్టుకుపోయిన అస్లాం అనే వ్యక్తి క్షేమంగానే ఉన్నాడు.



బుధవారం సాయంత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అస్లాం కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలించారు.



మూడు గంటల తర్వాత అస్లాం క్షేమంగా దొరికినట్టు సమాచారం. అస్లాం వరదల్లో కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు అస్లాం ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆనందం నెలకొంది.