పెంపుడు కుక్కతో మహిళా వ్యోమగామి ఎమోషన్ వీడియో : ఏడాది తరువాతకూడా నన్ను గుర్తుపట్టింది..!!

  • Publish Date - February 14, 2020 / 09:17 AM IST

328 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్‌ ను ఆమె కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సాదరంగా ఇంటికి తీసుకువెళ్లారు.

టెక్సాస్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె పెంపుడు కుక్క ఎల్బిడి (లిటిల్ బ్రౌన్ డాగ్)కి క్రిస్టీనో రాక తెలిసిపోయింది. ఆమె ఇంటికి చేరుకునే సమయానికి ఎల్బిడి ఇంటిలోనే ఉంది. డోర్ వేసేసి ఉంది. క్రిస్టీనో ఇంటికి చేరుకోవటం తెలుసుకున్న ఎల్బిడీ ఎంతో ఆత్రంగా..ఆమె దగ్గరకు రావాలని ఎంతో ఉత్సాహపడిపోయింది. ఎంతో ఎగ్జయింట్ మెంట్ ఫీల్ అయ్యింది. కానీ ఇంటి డోర్ వేసేసి ఉంది. డోర్అవతల ఉన్న క్రిస్టీనో చూసింది. డోర్ అలా తెరుచుకుందో లేదో ఎల్బిడీ ఒక్కసారిగా బైటకు ఉరికింది. క్రిస్టీనోను ఎంతో ఆదరంగా..ప్రేమగా ఆహ్వానించినట్లుగా ఎదురు వెళ్లి లోపలికి తీసుకొచ్చింది. 

అలా క్రిస్టీనో తన భర్తతో పాటు ఇంట్లో అడుగుపెట్టగానే..తోక ఊపుకుంటూ గెంతులేసింది. ఆమెపైకి ఎక్కేసింది. కాళ్లు చాస్తూ, అరుస్తూ..క్రిస్టినో ముఖాన్ని ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రేమగా నాకింది.క్రిస్టీనోను చూసిన ఉత్సాహంతో ఎల్బడీ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఎంతగానో ఎగ్జయిట్ అయిపోయింది ఎల్బిడీ. 

అలా తన ప్రేమగల పెంపుడు కుక్క తనను గుర్తు పట్టటంపై క్రిస్టీనో ఎంతో ఆనందపడింది. అంతకాలం తాను కనిపించకుడా పోయినా తనను గుర్తుపట్టిందని దానికి సంబంధించిన ఓ వీడియో షేర్‌ చేశారు క్రిస్టీనో. ‘‘ఎవరు ‘‘ఎక్కువగా ఎగ్జైట్‌ అయ్యారో తెలియదు. అయితే ఒక విషయం సంవత్సరం తరువాత కూడా నన్ను గుర్తుపట్టింది. వెరీ వెరీ హ్యాపీ అంటూ ’’ అంటూ పెంపుడు కుక్క గురించి ఆమె పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పటికే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

ఈ వీడియోపై నాసా కూడా తనదైన శైలిలో స్పందించింది. వాలెంటైన్స్‌ డేను పురస్కరించుకుని లవ్‌ సింబల్‌తో ఆస్ట్రోనాట్‌ విష్‌ చేస్తున్న జిఫ్‌ ఇమేజ్‌ను పోస్ట్‌ చేసింది. కాగా అమెరికాలోని మిషిగన్‌లో జన్మించిన క్రిస్టీనో గత ఏడాది డిసెంబరు 28న సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన మహిళ వ్యోమగామిగా పెగ్గి విట్సన్‌ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 328 రోజులపాటు క్రిస్టీనో అంతరిక్షంలో గడిపారు.అమెరికాకు చెందిన క్రిస్టీనో  కోచ్‌ 2019 మార్చి 14న ఐఎస్‌ఎస్‌కు వెళ్లగా గత గురువారం భూమి మీద ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే.