చిన్నపిల్లలు ఉన్న ఉంట్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. పిల్లలు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారో అస్సలు చెప్పలేం. మనకు ఎంత పని ఉన్నా వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు. ఇక విషయంలోకి వస్తే.. తాజాగా స్పెయిన్ లో చోటుచేసుకున్న ఘటన.. పిల్లల పట్ల పెద్దలు ఎంత కేర్ ఫుల్ గా ఉండాలో చెబుతుంది.
సాధారణంగా 3, 4 అంతస్తుల బాల్కనీ నుంచి కిందికి చూస్తేనే పెద్దలకు కూడా భయమేస్తుంది. అలాంటిది ఓ చిన్నారి అంత ఎత్తులో ఉన్న కిటికీ నుంచి బయటకు వచ్చి సైడ్ గోడపై చకచకా నడిచేసింది. అలా బాల్కనీ వరకు నడుచుకుంటూ వెళ్లి.. మళ్లీ తిరిగి వెనక్కి వచ్చి కిటికీలో నుంచి లోపలికి వెళ్లిపోయింది. ఈ వీడియోను 98FM రేడియో ప్రోడ్యూసర్, ప్రజంటర్ జెర్ డిక్సాన్ ఇటీవల ట్విట్టర్ లో పోస్టు చేశారు.
చిన్నారి సాహసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు.. ఆమె తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. ఆ భవనంపై నడిచేప్పుడు ఆమె కాలు కొంచెం స్లిప్ అయినా క్షణాల్లో ఘోరం జరిగిపోయేదని మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా చూశారు.
This is absolutely terrifying to watch. Apparently recorded in Tenerife… I always try to book ground floor rooms when on hols with the kids.. you can see why pic.twitter.com/Vxlps0aoYJ
— Jer Dixon (@JeremyDixonDJ) January 6, 2020