Pathaan : నాలుగు రోజుల్లో నాలుగొందల కోట్లు.. అత్యంతవేగంగా పఠాన్ మరో సరికొత్త రికార్డ్..

పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక మొదటి రోజు ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. గత సంవత్సర కాలంగా దీన స్థితిలో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ కలెక్షన్స్ బూస్టప్ ఇస్తుంది. రోజు రోజుకి కలెక్షన్స్.................

Pathaan : నాలుగు రోజుల్లో నాలుగొందల కోట్లు.. అత్యంతవేగంగా పఠాన్ మరో సరికొత్త రికార్డ్..

Pathaan collected 400 crores in 4 days creates new records

Pathaan :  దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. షారుఖ్, దీపికా జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25 న రిలీజయి మంచి విజయం సాధించింది. షారుఖ్ గత సినిమాలు పరాజయం అయి ఉండటం, షారుఖ్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో రావడం.. ఇవన్నీ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొల్పాయి. సినిమా రిలిజ్ రోజు నుంచే మంచి కలెక్షన్స్ ని అందుకుంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఇదే సమయంలో వేరే ఏ సినిమాలు కూడా రిలీజ్ లేకపోవడం పఠాన్ కలెక్షన్స్ కి మరింత బూస్టప్ ఇచ్చింది.

పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక మొదటి రోజు ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. గత సంవత్సర కాలంగా దీన స్థితిలో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ కలెక్షన్స్ బూస్టప్ ఇస్తుంది. రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. నాలుగు రోజుల్లో పఠాన్ సినిమా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంటే దాదాపు 212 కోట్ల షేర్ కలెక్షన్స్ పఠాన్ సినిమాకి నాలుగు రోజుల్లో వచ్చాయి. అత్యంత వేగంగా 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా పఠాన్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అలాగే షేర్ కలెక్షన్స్ లో కూడా అత్యంత వేగంగా 200 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. నాలుగో రోజు కూడా 52 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది పఠాన్.

CCL : సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేస్తుంది.. హీరోలు స్టేడియంలో బ్యాట్ పట్టుకుంటే..

షారుఖ్ పఠాన్ సినిమా హిట్ అయి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. షారుఖ్ బాలీవుడ్ కి కొత్త ఆశలు నెలకొల్పదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక నేడు ఆదివారం కావడంతో కచ్చితంగా ఇవాళ్టితో 500 కోట్లు వసూలు చేస్తుంది పఠాన్ సినిమా అని అంతా భావిస్తున్నారు.