‘నన్ను పెళ్లి చేసుకుంటావా’:ఇలా వెరైటీగా..ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి కాదంటుంది!!
Italian nurse To Girlfriend Wearing PPE Kit : ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటం ఓ కళ. చాలామంది తమ జీవితాల్లో అది ఓ తీయని జ్ఞాపకంగా మిగిలిపోవాలని వినూత్నంగా ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్ చేయటంలో ఆ కళలో ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. ఈ కరోనా కాలంలో ఓ ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఇంత ప్రేమగా..ఆర్థ్రంగా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? చెప్పండి..అందుకే ఆమె వెంటనే ఓకే..చెప్పేసింది. దీంతో ఓ ప్రియుడు ఫిల్ హ్యాపీ ఫీలైపోయాడు. ఖుషీ ఖుషీగా ఎగిరి గంతేసాడు. మరి ఆ ప్రియుడు చేసిన లవ్ ప్రపోజల్ ఏమిటో ప్రేమ పక్షులే కాదు అందరూ తెలుసుకోవాలనుంటుంటారు. ఆ హ్యాపీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఇటలీ వెళ్లాల్సిందే…
ఇటలీలోని పుగిలాలోని ఒస్తుని హాస్పటల్లోని కరోనా వార్డులో గుసెప్పే పున్గెంటే అనే యువకుడు నర్స్‌గా (కాంపౌండర్) పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కారెమెల్కి పెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కరోనా నిబంధనల ప్రకారం పూర్తిగా పీపీఈ కిట్ ధరించి..ప్రపోజ్ చేశాడు.
తను వేసుకున్న పీపీఈ కిట్ వెనుక వైపు ‘కారెమెల్.. నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని రాసుకుని..దాని కింద ‘ఎస్’ ఆర్ ‘నో’ అని రాసుకుని ప్రపోప్ చేశాడు. ఆ వెరైటీ ప్రపోజ్ చూసిన అతడి గర్ల్ ఫ్రెండ్ కారెమెల్ వెంటనే ఓకే చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను..ఫోటోను గుసెప్పే పున్గెంటే తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.