Traffic Noise : ట్రాఫిక్ సౌండ్స్‌తో గుండె జబ్బుల ముప్పు.. తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు!

Traffic Noise : వాహనాలతో కలిగే శబ్ద కాలుష్యం కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. ప్రతి 10 డెసిబుల్స్ (dBA) ట్రాఫిక్ శబ్దానికి గుండె సమస్యల ప్రమాదం 3.2శాతం పెరుగుతుందని కనుగొన్నారు.

Traffic Noise : ట్రాఫిక్ సౌండ్స్‌తో గుండె జబ్బుల ముప్పు.. తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు!

traffic noise risk of heart disease ( Image Credit : Google)

Traffic Noise : ప్రస్తుత రోజుల్లో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. వాహనాల నుంచి వెలువబడే శబ్దాల కారణంగా తీవ్ర స్థాయిలో శబ్ద కాలుష్యానికి దారితీస్తోంది. ట్రాఫిక్ సౌండ్స్ ప్రభావంతో హృదయ సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా ట్రాఫిక్ శబ్దం బాధించేది మాత్రమే కాదు.. మీ గుండె పనితీరును దెబ్బతీస్తుంది.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

తద్వారా గుండెజబ్బుల బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోడ్లు, రైళ్లు, విమానాల నుంచి వచ్చే శబ్దం కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

ట్రాఫిక్ శబ్దంతో అనేక అనారోగ్య సమస్యలు :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ట్రాఫిక్ శబ్దం కారణంగా పశ్చిమ ఐరోపాలో ప్రతి సంవత్సరం 1.6 మిలియన్ సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితం కోల్పోతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా రాత్రి సమయంలో, ట్రాఫిక్ శబ్దం నిద్రలో గందరగోళానికి గురి చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. రక్త నాళాలు, మెదడులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో రక్తనాళాల్లో వాపు ఏర్పడి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అది క్రమంగా గుండె సమస్యలను మరింత ఎక్కువగా పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ట్రాఫిక్ శబ్దానికి 3.2శాతం పెరిగిన హార్ట్ రిస్క్ :
డెన్మార్క్, యూఎస్ఏ, స్విట్జర్లాండ్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ట్రాఫిక్ శబ్దం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనం నిర్వహించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సర్క్యులేషన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు అనేక అధ్యయనాలను పరిశీలించారు.

ప్రతి 10 డెసిబెల్స్ (dBA) ట్రాఫిక్ శబ్దానికి, గుండె సమస్యల ప్రమాదం 3.2శాతం పెరుగుతుందని కనుగొన్నారు. శబ్దంతో జన్యువులు, శరీరంలోని జీవక్రియను ఎలా గందరగోళానికి గురిచేస్తుందో కూడా పరిశోధించారు. శబ్దం కారణంగా గుండె సమస్య మరింత ఎక్కువగా పెరిగిందని పరిశోధకులు ధృవీకరించారు.

విమాన శబ్దంతో గుండెజబ్బుల ముప్పు :
క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, ఆర్టరీ హైపర్‌టెన్షన్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్‌తో సహా వివిధ కార్డియోవాస్కులర్, సెరెబ్రోవాస్కులర్ వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని గుర్తించారు. అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట విమానం శబ్దానికి గురికావడం ఒత్తిడి-ప్రేరిత కార్డియోమయోపతితో ముడిపడి ఉందని తేలింది. దీనిని టాకోట్సుబో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఒత్తిడి ప్రతిస్పందనలు రక్తపోటును భారీగా పెంచుతాయి. దాంతో వాస్కులర్ పనితీరును బలహీనపరుస్తాయి.

కొవిడ్-19 మహమ్మారి తర్వాత కూడా జనాభాలో ఎక్కువ శాతం మంది హానికరమైన ట్రాఫిక్ శబ్దానికి గురవుతున్నారు. శబ్ద నియంత్రణ ప్రయత్నాలు, శబ్దం తగ్గింపు చట్టాలు భవిష్యత్తులో ప్రజారోగ్యానికి చాలా ముఖ్యమైనవిగా యూనివర్శిటీకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త మెడికల్ సెంటర్ మెయిన్జ్ డాక్టర్ థామస్ మ్నెజెల్ అన్నారు. శబ్దాన్ని తగ్గించుకోవడానికి మన గుండెను రక్షించుకోవడానికి మంచి ట్రాఫిక్ చట్టాలు, వ్యూహాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!