దీపావళికి సాండ్ కీ ఆంఖ్

తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో రూపొందుతున్న 'సాండ్ కీ ఆంఖ్'.. దీపావళికి విడుదల..

  • Published By: sekhar ,Published On : August 30, 2019 / 11:23 AM IST
దీపావళికి సాండ్ కీ ఆంఖ్

Updated On : May 28, 2020 / 3:44 PM IST

తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘సాండ్ కీ ఆంఖ్’.. దీపావళికి విడుదల..

తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. ‘సాండ్ కీ ఆంఖ్’.. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మాతలు. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సాండ్ కీ ఆంఖ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
అందులో వయోవృద్ధులుగా సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న తాప్సి, భూమి.. చేతిలో షూటింగ్‌ టార్గెట్‌ బోర్డ్‌ పట్టుకుని విజయ గర్వంతో నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. 87 ఏళ్ళ చంద్రో తోమర్‌గా భూమి, 82 ఏళ్ళ ప్రకాషీ తోమర్‌గా తాప్సీ  నటిస్తున్నారు. వీరిద్దరూ షూటింగ్‌లో కోచింగ్ తీసుకున్నారు. 60 ఏళ్ళ వయసులో షూటర్స్‌గా.. దాదాపు ఏడు వందల పతకాలు సాధించి, ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించి, ఎందరికో ఆదర్శంగామారి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు చంద్రో, ప్రకాషీ తోమర్..

Read Also : మామను పొగడ్తలతో ముంచెత్తిన కోడలు పిల్ల..

ప్రకాష్ ఝా, వినీత్ కుమార్ సింగ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. 2019 దీపావళికి ‘సాండ్ కీ ఆంఖ్’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : విశాల్ మిశ్రా, సినిమాటోగ్రఫీ : సుధాకర్ రెడ్డి యెక్కంటి, స్క్రీన్‌ప్లే : జగదీప్ సింధు.