Rapido Food App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా రాపిడో కొత్త ఫుడ్ డెలివరీ Ownly యాప్.. ఫస్ట్ సర్వీసు ఎక్కడంటే? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Rapido Food App : రాపిడో ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో లిస్ట్ అయింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తోంది.

Rapido Food App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా రాపిడో కొత్త ఫుడ్ డెలివరీ Ownly యాప్.. ఫస్ట్ సర్వీసు ఎక్కడంటే? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Rapido Food App

Updated On : August 14, 2025 / 5:08 PM IST

Rapido Food App : ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే మరో సరికొత్త యాప్ (Ownly) వచ్చేసింది. ప్రస్తుత మార్కెట్లో స్విగ్గీ, జొమాటోలకు పోటీగా పాపులర్ (Rapido Food App) రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడో కంపెనీ కొత్త ఫుడ్ డెలివరీ యాప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ సర్వీసు బీటా ట్రయల్‌ను కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ కొత్త సర్వీసు ప్రారంభమైంది. ఈ యాప్ ద్వారా తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.

రాపిడో ఫుడ్ డెలివరీ సర్వీస్ స్విగ్గీ, జొమాటో వంటి భారీ కంపెనీలకు గట్టి పోటీని అందించనుంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో కంపెనీ ఫుడ్ డెలివరీ సర్వీసును ట్రయల్ ప్రాతిపదికన ప్రారంభించింది. ఇందులో బైరసాంద్ర, తవరేకెరె, మండివాలా (బాటమ్) లేఅవుట్, హోసూర్ సర్జాపుర రోడ్ (హసర్) లేఅవుట్, కోరమంగళ ఉన్నాయి. యాప్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫుడ్ డెలివరీ సర్వీస్ కోసం కొత్త కంపెనీ :
టెక్ క్రంచ్ రిపోర్టు ప్రకారం.. రాపిడో ఫుడ్ డెలివరీ సర్వీసును ప్రారంభించేందుకు Ctrlx టెక్నాలజీస్ అనే సహ-సంస్థను ఏర్పాటు చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. రాపిడో వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) వివేక్ కృష్ణ అనుబంధ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొంది. అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు నిర్దిష్ట కారణం లేదని పేర్కొంది.

Read Also : FASTag Annual Pass : ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. ఇకపై మీరు రూ. 15తో టోల్ ప్లాజా దాటొచ్చు.. వార్షిక పాస్ యాక్సస్ ఇలా?

ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మీ డేటా కోసం రాపిడో ఓన్లీ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లేలో లిస్ట్ అయింది. అయితే, ఈ యాప్ ఇంకా ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. ఈ యాప్ సమీపంలోని రెస్టారెంట్ల నుంచి స్విగ్గీ, జొమాటో కన్నా దాదాపు 15శాతం తక్కువ ధరలకు ఫుడ్ అందిస్తోంది.

ఓన్లీ ఫుడ్ డెలివరీ యాప్ రెస్టారెంట్ల నుంచి కమీషన్ వసూలు చేయదు. అదే సమయంలో, స్విగ్గీ, జొమాటో వంటి ఇతర ఫుడ్ డెలివరీ యాప్స్ రెస్టారెంట్ల నుంచి 30శాతం వరకు కమీషన్ వసూలు చేస్తాయి. రాపిడో రెస్టారెంట్ నుంచి ఆర్డర్‌కు నిర్ణీత రుసుమును వసూలు చేస్తోంది.

తక్కువ ధరకే ఫుడ్ అందిస్తాం :
ఈ యాప్ ద్వారా రాపిడో రూ. 150 లేదా అంతకంటే తక్కువ ధరకు కనీసం 4 ఫుడ్ ఆర్డర్లను అందించనుంది. స్విగ్గీ, జొమాటో కన్నా 15 శాతం తక్కువ ధరలకు ఫుడ్ అందిస్తుంది.