Minimum Balance Rule : కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. HDFC, SBI ఇతర బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే?

Minimum Balance Rule : ఐసీఐసీఐ బ్యాంక్, HDFC, SBI, కోటక్ మహీంద్రా బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఎంతంటే?

Minimum Balance Rule : కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. HDFC, SBI ఇతర బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే?

Minimum Balance Rule

Updated On : August 14, 2025 / 4:00 PM IST

Minimum Balance Rule : బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. భారతీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై నెలకు (Minimum Balance Rule) కనీస బ్యాలెన్స్ (MBR) రూ. 50వేలకు పెంచింది. అయితే, ఇప్పుడు కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో రూ. 50వేలు నుంచి రూ. 15వేలకు పరిమితం చేసింది.

ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ మెట్రో, అర్బన్ రీజియన్ బ్రాంచులలో నెలకు కనీస అకౌంట్ బ్యాలెన్స్ రూ. 50వేలకు పెంచింది. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన కస్టమర్లకు ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 15వేలకు తగ్గించింది.

ఐసీఐసీఐ బ్యాంక్ సెమీ-అర్బన్ సెగ్మెంట్ బ్రాంచ్‌లకు కనీస బ్యాలెన్స్ పరిమితిని మునుపటి రూ. 5వేల నుంచి రూ. 25వేలకు పెంచింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ గ్రామీణ బ్రాంచులకు కనీస బ్యాలెన్స్ పరిమితి కూడా గత రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది.

ఖాతాలో కనీస బ్యాలెన్స్ (MAB) ఎందుకంటే? :
కనీస అకౌంట్ బ్యాలెన్స్ (MAB) ప్రతి బ్యాంకు అకౌంట్లకు తప్పనిసరి. ఒక కస్టమర్ తమ సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచుకుంటే ఎలాంటి పెనాల్టీలు పడవు. సేవింగ్స్ అకౌంట్ టైప్, బ్రాంచ్ లొకేషన్ ఆధారంగా ప్రతి బ్యాంకుకు కనీస బ్యాలెన్స్ లిమిట్ ఉంటుంది. మెట్రో, అర్బన్ బ్రాంచ్, సెమీ-అర్బన్ బ్రాంచ్, రూరల్ బ్రాంచ్ అనేదానిపై ఆధారపడి కనీస బ్యాలెన్స్ పరిమితి ఉంటుంది.

టాప్ భారతీయ బ్యాంకులకు కనీస బ్యాలెన్స్ లిమిట్ :
భారతీయ బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-క్యాప్) ఆధారంగా ర్యాంక్ చేసిన సంస్థాగత రుణదాతలకు కనీస బ్యాలెన్స్ పరిమితిని తప్పనిసరి చేసింది. ఏయే బ్యాంకుల్లో ఎంత కనీస బ్యాలెన్స్ ఉంచాలి? ఎంత మేర పెనాల్టీలు విధిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. HDFC బ్యాంక్ :
భారత అతిపెద్ద ప్రైవేట్ రంగ HDFC బ్యాంక్ కస్టమర్ల అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ రివైజ్ చేసింది. పట్టణ బ్రాంచులకు కనీసం ఏడాదిలో నెలవారీగా రూ. 10వేలు కనీస బ్యాలెన్స్ లేదా రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని ఉంచాలని సూచిస్తుంది.

Read Also : SBI IMPS Transfer : ఆగస్టు 15 నుంచి SBI కొత్త రూల్.. రూ. 25వేలు దాటితే IMPS లావాదేవీలు ఫ్రీ కాదు.. ఛార్జీలు చెల్లించాల్సిందే..!

ప్రైవేట్ బ్యాంకుల సెమీ-అర్బన్ బ్రాంచులలో సగటు నెలవారీ బ్యాలెన్స్ నెలకు రూ. 5వేలు లేదా ఒక ఏడాదిలో అదే కాలానికి రూ. 50వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. గ్రామీణ బ్రాంచులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు ఇతర బ్రాంచుల మాదిరిగానే త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ. 2,500 లేదా రూ. 25వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంచాల్సి ఉంటుంది.

2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కస్టమర్లు నెలవారీ లేదా త్రైమాసికానికి కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ ప్లస్ బ్యాంక్ అకౌంట్లలో ప్రతి నెలా జీరో కనీస బ్యాలెన్స్ మాత్రమే ఉంటాయి.

3. కోటక్ మహీంద్రా బ్యాంక్ :
ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్.. కస్టమర్లు సేవింగ్ అకౌంట్ టైప్ బట్టి రూ. 10వేలు, రూ. 20వేల మధ్య కనీస బ్యాలెన్స్ ఉంచాలి. అధికారిక డేటా ప్రకారం.. నెలకు సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) కన్నా తక్కువ మొత్తంపై బ్యాంక్ 6శాతం ఛార్జీని విధిస్తుంది. బ్యాంక్ రోజువారీ సేవింగ్ అకౌంట్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్, ఏస్ సేవింగ్స్ అకౌంట్ మొదలైన మల్టీ సేవింగ్స్ అకౌంట్లు వంటి ఆప్షన్లను అందిస్తుంది.

4. యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు సెమీ-అర్బన్ లేదా రూరల్ బ్రాంచ్‌లతో సహా అన్ని ప్రదేశాలకు నెలకు సగటున రూ. 10వేలు బ్యాలెన్స్ లేదా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం రూ. 50వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కలిగి ఉండాలి. మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ అకౌంట్లలో 3 బ్రాంచులకు ప్రియారిటీ సేవింగ్స్ అకౌంట్ కనీస బ్యాలెన్స్ అవసరం. నెలకు రూ. 2లక్షలు కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే బ్యాంక్ 6శాతం పెనాల్టీ వేస్తుంది. గరిష్టంగా రూ. 600 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

5. బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు మెట్రో బ్రాంచుల్లో రూ. 2వేలు, సెమీ-అర్బన్ బ్రాంచులకు రూ. 1,000, గ్రామీణ బ్రాంచులకు రూ. 500 కనీస త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (QAB) బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి.

6. పంజాబ్ నేషనల్ బ్యాంక్ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) డేటా ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకు కస్టమర్లు మెట్రో నగరాలకు నెలకు రూ. 10వేలు కనీస అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి. అయితే, అర్బన్ బ్రాంచ్‌లకు రూ. 5వేలు తప్పనిసరి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. PNB సెమీ-అర్బన్ బ్రాంచ్‌ కలిగిన కస్టమర్‌లు నెలకు కనీసం రూ. 2వేలు కనీస బ్యాలెన్స్‌ ఉంచాలి. గ్రామీణ బ్రాంచులలో కనీస బ్యాలెన్స్ నెలకు రూ. 1,000గా బ్యాంకు పేర్కొంది.

7. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం మెట్రో, అర్బన్ బ్రాంచులకు సగటున రూ. 1,000 త్రైమాసిక బ్యాలెన్స్ ఉంచాలని సూచిస్తోంది. అయితే సెమీ-అర్బన్ బ్రాంచులకు రూ. 500 ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ శాఖలోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు కనీసం రూ. 250 (సగటు త్రైమాసిక బ్యాలెన్స్) ఉండాలి.

8. కెనరా బ్యాంక్ :
ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) ఎత్తేసింది. వినియోగదారులు తమ సేవింగ్స్ అకౌంట్లలో కనీస నెలవారీ బ్యాలెన్స్‌ లేకపోయినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అన్ని కెనరా బ్యాంక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు అన్ని సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు ‘కనీస బ్యాలెన్స్‌ లేకపోయినా ఎలాంటి జరిమానా ఉండదు.

9. IDBI బ్యాంక్ :
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. IDBI బ్యాంక్ మెట్రో, అర్బన్ బ్రాంచులలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో కనీస అకౌంట్ బ్యాలెన్స్ రూ. 10వేలు ఉంచాలి. సెమీ అర్బన్ బ్రాంచులకు కనీసం రూ. 5వేలు, బ్యాంకు గ్రామీణ శాఖ ద్వారా తమ బ్యాంకు అకౌంట్లను యాక్సెస్ చేసే కస్టమర్లకు రూ. 2,500 తప్పనిసరి చేసింది. అధికారిక డేటా ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ దేశవ్యాప్తంగా గ్రామీణ FI (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) బ్రాంచులను కలిగి ఉంది. నెలకు రూ. వెయ్యి కనీస బ్యాలెన్స్ ఉంచాలి.

10. ఇండియన్ బ్యాంక్ :
మెట్రో, అర్బన్ బ్రాంచ్ ప్రాంతాల్లో చెక్ సౌకర్యాలు ఉన్న సేవింగ్స్ అకౌంట్లకు నెలకు రూ. 2,500 కనీస అకౌంట్ బ్యాలెన్స్, చెక్కు సౌకర్యాలు లేని అకౌంట్లకు రూ. 1,000 ఉంచాల్సిందిగా ఇండియన్ బ్యాంక్ తెలిపింది. అధికారిక డేటా ప్రకారం.. సెమీ-అర్బన్, గ్రామీణ బ్రాంచుల విషయంలో బ్యాంకు కస్టమర్లు చెక్కు సౌకర్యాలతో రూ. 1,000, చెక్ సౌకర్యాలు లేకుండా రూ. 500 కనీస బ్యాలెన్స్ ఉంచాలి.

11. యస్ బ్యాంక్ :
యస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ప్రైమరీ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ కస్టమర్లు కనీస అకౌంట్ బ్యాలెన్స్‌ను ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇతర ప్రీమియం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, సేవింగ్స్ అకౌంట్ ప్రో కోసం నెలకు సగటు కనీస బ్యాలెన్స్ అవసరం. రూ. 10వేలు, సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్ కోసం నెలకు రూ. 25వేలు ఉంచాలి. యెస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. కనీస బ్యాలెన్స్‌తో పాటు 5 రెట్లు విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అవకాశాన్ని కూడా అందిస్తుంది.