భారత కరోనా రోబోలు: పేషెంట్లకు థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ కోసం వాడుతున్నారు.. ఎలా పనిచేస్తున్నాయంటే?

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 12:48 PM IST
భారత కరోనా రోబోలు: పేషెంట్లకు థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ కోసం వాడుతున్నారు.. ఎలా పనిచేస్తున్నాయంటే?

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో 1.3 బిలియన్ల మంది నివాసితులు మార్చి 24 నుంచి లాక్ డౌన్ జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు చేపట్టిన కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలను నిర్వహించేందుకు దేశంలో హెల్త్ కేర్ వర్కర్ల అవసరం ఎక్కువగా ఉంది.

ఈ పరిస్థితుల్లో హెల్త్ కేర్ వర్కర్లలో కొంత భారాన్ని తగ్గించేందుకు భారత్ కరోనా రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పేషెంట్లకు థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేసేందుకు రోబోలను వాడుతోంది భారత్. కరోనా బాధితుల శరీర ఉష్ణోగ్రతను గుర్తించేందుకు మిత్రా అనే హ్యూమనాయిడ్ రోబోట్ ను భారతీయ ఆస్పత్రి వినియోగిస్తోంది.

ఈ రోబోలను క్షేత్ర స్థాయిలో వినియోగించేందుకు గతవారమే ఆర్డర్లను కనీసం రెండు వారాల వరకు పొడిగించారు. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో కరోనావైరస్ ఉన్న కొంతమంది రోగులకు ఈ రోబోలను మొదటి స్క్రీనింగ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇటలీలోని ఒక ఫార్మసీ కరోనా వ్యాప్తి సంకేతాల కోసం యూజర్లను పరీక్షించడానికి ఇలాంటి సాంకేతికతను అమలు చేసింది. ఇంతకీ ఈ రోబోలు ఎలా పనిచేస్తాయో ఓసారి చూద్దాం.. 
carona robots

* వైరస్‌ను ఆపడానికి చాలా ఖచ్చితమైన థర్మామీటర్లు కూడా సరైన కొలత కాదు. వ్యాధి సోకిన వ్యక్తులు లక్షణాలు కనిపించకపోయినా 14 రోజుల వరకు వెళ్ళవచ్చు. మరికొంతమందిలో ఎప్పుడూ లక్షణాలు అసలే పెరగవు. 
caronavirus

* కొంతమంది నిపుణులు టెంపరేచర్ గన్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైనవి కాదని సూచించారు. ఎందుకంటే అవి ఒక నిర్దిష్ట దూరం వద్ద ఉండాలి. కానీ, రోబో ఛాతిపై టాబ్లెట్.. రోగులకు ఎక్కడ నిలబడాలో సూచించడం ద్వారా ఆ సమస్యను నివారిస్తుంది. 
robots carona

* ఉష్ణోగ్రతను గుర్తించిన తరువాత, రోబో కరోనా పేషెంట్‌కు తదుపరి దశల సూచనలను ఇస్తుంది. 
robots

* ఈ సమాచారాన్ని ఉపయోగించి, హెల్త్‌కేర్ ప్రొవైడర్లు రోగులను తగిన నిపుణుడికి పంపవచ్చు. కరోనావైరస్ సోకే అవకాశం లేని పేషెంట్లు అనవసరంగా ప్రభావానికి గురికాలేరు. 
robotss

* థర్మల్ కెమెరాతో కూడిన రోబో పేషెంట్లను తాకకుండా టెంపరేచర్ రీడింగ్ తీసుకుంటుంది.
robots covid

* ఒక రోబో ఛాతీపై ఒక టాబ్లెట్ వైద్యులు వారి ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా రోగితో వీడియో చాట్ చేయడానికి అనుమతిస్తుంది.
caronavirus robots

* రోబోలు వైద్యులు రోగుల ప్రారంభ టెస్టులు చేయడానికి సురక్షితమైన మార్గం.