Starlink Plans : అతి త్వరలో స్టార్‌లింక్ ప్రారంభం.. ప్లాన్‌లు, ధరలు, లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్..
Starlink Plans : భారత్‌లో త్వరలోనే స్టార్‌లింక్ ప్రారంభం కానుంది. అధికారిక లాంచ్ తేదీ, ప్లాన్ల ధరలకు సంబంధించి పూర్తి వివరాలివే..

Starlink Plans
Starlink Plans : అతి త్వరలో భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ప్రారంభం కానుంది. శాటిలైట్ ఆధారిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (Starlink Plans) టెలికమ్యూనికేషన్స్ విభాగం, IN-SPACe అధికారం నుంచి అవసరమైన అన్ని లైసెన్స్‌లను క్లియర్ చేసింది.
అయితే, భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసుకు సంబంధించి కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా కంపెనీ జియో, ఎయిర్‌టెల్‌తో సహకారాన్ని కూడా ప్రకటించింది. అయితే, అధికారిక రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
టెలికాం ప్రొవైడర్ అధికారిక రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ప్రస్తుత టెలికాం పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్టార్‌లింక్ యూజర్ల సంఖ్యను 2 మిలియన్లకు పరిమితం చేసినట్లు సమాచారం. స్టార్‌లింక్ లభ్యత, ధర, ఇతర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ టైమ్‌లైన్ :
స్టార్‌లింక్ నియంత్రణ అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్టే కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల సహకారం దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. స్టార్‌లింక్ రాబోయే నెలల్లో సర్వీసును ప్రారంభించే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధృవీకరించినట్లుగా స్టార్‌లింక్ కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
SATCOM గేట్‌వేలకు ఆమోదాలు, పాయింట్లను ఏర్పాటు చేయడం అవసరమైన స్పెక్ట్రమ్‌ను పొందడంతో పాటు నెట్‌వర్కింగ్ డివైజ్‌ల కోసం లైసెన్స్‌లను పొందవచ్చు. అనంతరం స్టార్‌లింక్ సర్వీసులను ప్రారంభించవచ్చు. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.
స్టార్‌లింక్ స్పీడ్, ప్లాన్లు, ఇన్‌స్టాలేషన్ ఖర్చు :
రిపోర్టుల ప్రకారం.. భారత మార్కెట్లో స్టార్‌లింక్ 25Mbps, 220Mbps మధ్య ఇంటర్నెట్ స్పీడ్ అందించవచ్చు. అయితే, సిగ్నల్ కండిషన్స్, లోకేషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ రూ. 30వేలు, రూ. 35వేల మధ్య ఒకేసారి ఇన్‌స్టాలేషన్ రుసుమును వసూలు చేయవచ్చు.
నెలవారీ ప్లాన్‌లు లోకేషన్, వినియోగాన్ని బట్టి రూ. 3వేల నుంచి రూ. 4,200 వరకు ఉండవచ్చు. స్టార్‌లింక్ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్లను 2026లో ప్రయోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 1,000Gbps కెపాసిటీ అందిస్తుంది.