Minister Satya Kumar: చంద్రబాబు కాదు.. జగనే రాహుల్ గాంధీకి టచ్ లో ఉన్నారు.. కాంగ్రెస్ నుండి విడిపోయిన ముక్క వైసీపీ- మంత్రి సత్యకుమార్ యాదవ్
జగన్ ఎక్కడ కోరితే అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. (Minister Satya Kumar)

Minister Satya Kumar Comments: ఏపీలో మరోసారి పొలిటికల్ ఫైట్ కాక పుట్టిస్తోంది. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెగులర్ గా టచ్‌లోనే ఉంటారని జగన్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై కూటమి నేతలు ఎదురు దాడికి దిగారు. మంత్రి సత్యకుమార్ యాదవ్.. జగన్ పై విరుచుకుపడ్డారు. (Minister Satya Kumar)
కాంగ్రెస్ నుంచి విడిపోయిన ముక్క..
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి కీలక పాత్ర వహిస్తున్నారో అందరికీ తెలుసు అని అన్నారు. చంద్రబాబు రాహుల్ గాంధీకి టచ్ లో ఉన్నారని జగన్ అంటున్నారు.. రాహుల్ తో టచ్ లో ఉన్నది చంద్రబాబు కాదు.. జగనే రాహుల్ గాంధీ కి టచ్ లో ఉన్నారని మేమంటున్నాము అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన ముక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. వారు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
ఎక్కడా అక్రమాలు జరగలేదు..
ఇక పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజా స్వామ్యద్ధంగా ఎన్నికలు జరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. ఎన్నికల కమీషన్ అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. జగన్ ఎక్కడ కోరితే అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
Also Read: నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. వాళ్లే వెళ్లిపోతారు : మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
రాహుల్ ఎందుకు మాట్లాడరు?
ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓట్ల అవకతవకల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని జగన్ ప్రశ్నించారు. 48 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మరి ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదా? ఈ విషయాన్ని రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ జగన్ నిలదీశారు. (Minister Satya Kumar)
అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్..
అంతేకాదు.. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో ఫోన్ లో నిత్యం టచ్‌లోనే ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరని జగన్ నిలదీశారు.
అమరావతిలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి, అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్, దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు..? నన్ను విమర్శిస్తారు తప్ప చంద్రబాబు తప్పులను ఎందుకు విమర్శించడం లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదన్నారు జగన్. ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.