నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. వాళ్లే వెళ్లిపోతారు : మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. కానీ, బయటి నుంచి వచ్చిన వారు ఊరు విడిచిపెట్టి పోతారు.. అది మీరు చూస్తారు.

నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. వాళ్లే వెళ్లిపోతారు : మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

Prabhakar Chowdhury

Updated On : August 13, 2025 / 2:54 PM IST

Prabhakar Chowdary: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బుధవారం మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. నేను ఒక సాధారణ మాజీ ఎమ్మెల్యేను, నాకు ఎవ్వరూ పోటీ కాదు.. నాకు నేనే పోటీ. నేను చేసిన అభివృద్ధి మీకు, వైసీపీకి కనిపించడం లేదా..? అంటూ ప్రశ్నించారు.

ఇంకొకరు చీకటి మిత్రులని అంటున్నారు. నాకు రాత్రి అయితే ఫుల్ బాటిల్ కొట్టాలని లేదు.. మందు వాసన తెలియదు. పేకాట ఆడటం రాదు.. ఇంకా చీకట్లో చేసే పనులు నాకు తెలియవు. నన్ను ఐదేళ్లు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇబ్బంది పెట్టారు. ఐదేళ్లు ఎన్నో ఎదుర్కొని నిలబడితే పార్టీ బతికించాం. చంద్రబాబు జైలుకు వెళ్తే సంబరాలు చేసుకున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు..? పార్టీలో బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టే కొన్ని మాట్లాడటం లేదని ప్రభాకర్ చౌదరి అన్నారు.

పార్టీలో కొన్ని హద్దులు, నియమాలు ఉంటాయి. ప్రజలు ఇబ్బందిపడుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు నాకు ఉంది. అసలు ఆధారాలు ఏంటన్నది సేకరిస్తున్నాను. అన్ని ఆధారాలతో చంద్రబాబు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తా.. న్యాయపోరాటం కూడా చేసేందుకు సిద్ధమవుతున్నా.. తొందరపడొద్దు.. కాలగర్భంలో చాలా మంది కలిసిపోయారు.. నేను నిశబ్ధంగా ఉన్నానంటే ఒక కారణం ఉంది.అది బయటపడ్డప్పుడు ఒక విప్లవం చూస్తారు అంటూ ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు.

నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. కానీ, బయటి నుంచి వచ్చిన వారు ఊరు విడిచిపెట్టి పోతారు.. అది మీరు చూస్తారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తామంటున్నారు.. చేయించండి ఇంకా ఫ్రీగా పనిచేస్తాను. భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, ఆసుపత్రిల్లో వాటాలు అన్నీ నేనే చేస్తున్నానా..? నేను వెన్నుపోటు పొడవాలనుకుంటే.. అప్పుడు డైరెక్ట్‌గా పోటీచేసి ఉండేవాడినని ప్రభాకర్ చౌదరి అన్నారు..

నేను ఆధారాలు బయటకు తీస్తే.. ప్రభుత్వం, పార్టీ మీద ప్రభావం పడుతుంది. పరిటాల రవి హత్య సమయంలో మీరు ఎక్కడ దాక్కున్నారు.. మీరు ఎంత ధైర్యవంతులో అందరికీ తెలుసు అంటూ ప్రభాకర్ చౌదరి అన్నారు.