ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, వీడియో వచ్చేస్తోంది
ఆర్.ఆర్.ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెకక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీంగా తారక్ ప్రేక్షకులను అలరించనున్నారు. అసలే దర్శకధీరుడు. ఇద్దరూ స్టార్ హీరోలు. ఇంకేముంది ఈ మూవీపై అటు సినీ వర్గాల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా, రాజమౌళి టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బర్త్ డే కు ఫ్యాన్స్ కోసం ఓ స్టిల్ కూడా వదలలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు. అంతకు మించి ఆర్ఆర్ఆర్ టీమ్ మీద గట్టిగా విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. వారి ఓ వీడియో ఈ సాయంత్రం(మే 19,2020) రాబోతోందని సమాచారం.
ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ వీడియో గిఫ్ట్ ను ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ ను ట్రైయిన్ చేసినపుడు, ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయించినపుడు తీసిన ఫొటోలు, వీడియోలు కలిసి వదలబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించే అవకాశం ఉందట. ఈ మేరకు లాయిడ్ స్టీవెన్స్ ఓ ట్వీట్ చేశారు. కాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని కోరుతూ అభిమానులకు లేఖ రాశారు ఎన్టీఆర్. ఈ విపత్త సమయంలో అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు. అధికారుల సూచనలు పాటిస్తూ, భౌటిక దూరానికి కట్టుబడి ఉండాలన్నారు. అదే మీరు నాకిచ్చే అతి విలువైన బహుమతి అని చెప్పారు.
So tomorrow being @tarak9999 ‘s Birthday, I have something special lined up for all his fans today… stay tuned and watch this space!! ?@smkoneru
— Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020
— Jr NTR (@tarak9999) May 18, 2020
Read: సింగర్ ‘సిధ్ శ్రీరామ్’ పుట్టినరోజు.. టాప్ 5 సాంగ్స్ మీకోసం..