ఎన్నికల వేళ.. మహిళ అపహరణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్

HD Revanna: రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఇండియాకి రాగానే అతడినీ..

ఎన్నికల వేళ.. మహిళ అపహరణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్

HD Revanna

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. మహిళ అపహరణ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇవాళ కర్ణాటకలోని పద్మనాభ నగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ ఇంట్లో రేవణ్ణను అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. అందుకు ప్రత్యేక కోర్టు ఒప్పుకోలేదు. దీంతో సిట్‌ అధికారులు రేవణ్ణను అదుపులోకి తీసుకుని వెళ్లారు. గతంలో రేవణ్ణ నివాసంలో పనిచేసిన తన తల్లి అపహరణకు గురైందని, ఆమెను వేధించారని ఆమె కుమారుడు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఇండియాకి రాగానే అతడినీ అరెస్ట్‌ చేయొచ్చు. రేవణ్ణ ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. రేవణ్ణ ఇంట్లో బాధితురాలు దాదాపు 5 ఏళ్ల పాటు పనిచేశారు. అనంతరం అక్కడి పని మానేశారు. ఏప్రిల్ 29న రేవణ్ణ సన్నిహితుడు సతీశ్ ఆమెను కారులో తీసుకెళ్లాడని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: సజ్జల