Custard Apple Cultivation : సీతాఫలం సాగులో మెళుకువలు ! పంటసాగులో అనువైన రకాలు

ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కుళ్ళిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి. 5 సంవత్సరాల తరువాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు, 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి.

Custard Apple Cultivation : సీతాఫలం సాగులో మెళుకువలు ! పంటసాగులో అనువైన రకాలు

Custard Apple Cultivation

Custard Apple Cultivation : తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక లాభాలను సమకూర్చే ఉద్యాన తోటలను పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్న నేపధ్యంలో చాలా మంది రైతులు సీతాఫలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. సీతాఫలం ఇసుక, రాతి, గంభీరంగా మరియు భారీ నేలల్లో కూడా బాగా పెరుగుతుంది. చెట్టు చాలా లోతుగా పాతుకుపోయింది. లోతైన నేల అవసరం లేదు. అత్యంత బెట్ట పరిస్థితులను సైతం తట్టుకొని జీవించగల సీతాఫలం మొక్కలను మెట్ట ప్రాంత వ్యవసాయదారులు సాగు చేసి నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చు. రాళ్లతో ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మురుగునీరు పోయే సదుపాయం కలిగి 5.5-7.5 ఉదజని సూచిక గల నేలలు అత్యంత అనుకూలం.

మొక్కలు నాటే ముందుగా ;

పొలాన్ని ఒకటికి రెండుసార్లు బాగా కలియ దున్ని సమాంతరంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత 60x60X60 సెం.మీ. గుంతలను 5×5 మీ. దూరంలో ఎకరానికి 160 గుంతలు తీసుకోవాలి. ప్రతీ గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్; 100 గ్రా. ఫాలిడాల్ పొడి, పైమట్టితో బాగా కలిపి గుంతలను నింపుకోవాలి. తరువాత మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటిన వెంటనే నీరు అందించాలి. తర్వాత నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి మొక్కలకు అవసరమైన నీటిని అందిస్తూ ఉండాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది.

సాగుకు అనువైన రకాలు ;

లాలసితపాల్, మముత్, బాలానగర్, బ్రిటిష్ గినియా, పింక్స్ మముత్, ఐలాండ్ జెమ్, వాషింగ్టన్, అర్కా సహన్, అటెమోయా రకాలు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్ధితులకు అనువైనవిగా చెప్పవచ్చు. ఈ రకాలతో వాణిజ్య శైలిలో రైతులు సాగు చేస్తున్నారు. సీతాఫలం చాలా నెమ్మదిగా పెరిగే మొక్క. తేలికపాటి కత్తిరింపు వల్ల మంచి శాఖలను ఏర్పరుచుకుని గుబురుగా పెరుగుతుంది.

ఎరువులు ;

ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కుళ్ళిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి. 5 సంవత్సరాల తరువాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు, 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి. మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు చెట్టుకు నీరు పోస్తే మొక్క బలంగా ఎదుగుతాయి.

కలుపు నివారణ, అంతర కృషి ;

మొదిటి 4 నెలల వరకు వేరుశనగ, అపరాలు, ఉలవలు, అలసంద తోపాటు కూరగాయ పంటను అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పంటలను చెట్ల మధ్యలో వేసి పూతరాక ముందే దున్నేయాలి. చెట్టునాటిన మూడవ ఏడాది నుండి కాపు వస్తుంది. 7 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి కాపు రెట్టింపవుతుంది. ఒక్కో చెట్టు 60 నుండి 100 కాయలు వస్తాయి. కాయలపై కళ్ళు పెద్దవిగా కనిపిస్తూ తెలుపు నుండి లేత పసుపు రంగు లేదా ఆరంజి రంగులోకి మారతుంటే పక్వానికి వస్తున్నట్లుగా గుర్తించాలి.

ప్యాకింగ్, మార్కెటింగ్ ;

పెద్ద పెద్ద కండ్లు కలిగిన కాయలను వేరు చేసి మార్కెట్ కు పంపితే మంచి ధర పొందవచ్చు. సీతఫలం కాయలు కోత తరువాత త్వరగా పక్వానికి వస్తాయి. కోసిన వెంటనే గంపలు లేదా అట్టపెట్టల్లో గడ్డి లేదా సీతాఫలం ఆకులను క్రింద పరచుకుని ప్యాకింగ్ చేసుకోవాలి. సీతాఫలానికి ఎక్కువ రోజులు నిల్వవుండే పరిస్ధితి లేనందున ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.