AP Covid -19 : ఏపీలో కరోనా..24 గంటల్లో 166 మందికి కరోనా...91 మంది డిశ్చార్జ్ | Andhra pradesh reports 166 new covid 19 cases

AP Covid -19 : ఏపీలో కరోనా..24 గంటల్లో 166 మందికి కరోనా…91 మంది డిశ్చార్జ్

విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.

AP Covid -19 : ఏపీలో కరోనా..24 గంటల్లో 166 మందికి కరోనా…91 మంది డిశ్చార్జ్

Andhra Pradesh New Covid 19 Cases :  ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో అధిక కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కరోనాతో పాటు..కొత్త వేరియంట్ జిల్లాలకు వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తోంది.

Read More : Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 166 మందికి కరోనా సోకింది. గుంటూరు, కృష్ణాలలో ఒక్కొక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసులకు గాను…20,58,601 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,495 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,154గా ఉందని తెలిపింది.

Read More : Milk Price Hike : రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. లీటర్‌పై రూ.2 పెంపు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 91 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,13,27,1317 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Rajasthan Omicron : రాజస్థాన్‌లో ఒమిక్రాన్ మరణం.. కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతి

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 28. ఈస్ట్ గోదావరి 10. గుంటూరు 10. వైఎస్ఆర్ కడప 03. కృష్ణా 21. కర్నూలు 09. నెల్లూరు 13. ప్రకాశం 06. శ్రీకాకుళం 03. విశాఖపట్టణం 31. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 12. మొత్తం : 166

×