Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

కరోనాను ఖతం చేయటానికి మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అదికూడా టాబ్లెట్ రూపంలో..ఈ మెడిసిన్ భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చింది.దీని ధర ఎంతంటే..

Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

Covid Tablet In Hyd

Molnupiravir Tablet Release in Hyderabad Market : కరోనా సోకినవారికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే యాంటీవైరల్ డ్రగ్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మెడిసిన్ మొదటిసారిగా హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చిది. దాని పేరు ‘మోల్నుపిరావిర్‌’. ఈ మెడిసిన్ కరోనాను ఐదు రోజుల్లో కట్టడి చేయగలుగుతుందని చెబుతున్న ఈ మోల్నపిరావిర్ భారత్ లో ముందుగా హైదరాబాద్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇవి 40 ట్యాబ్లెట్స్ సుమారు రూ.2,000 నుంచి రూ.2,500ల ధరను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

Read more : US first covid pill : కోవిడ్‌ చికిత్సలో మరో అడుగు..తొలి టాబ్లెట్‌కు ఆమోదం..

హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా భారత్ లో కోవిడ్-19 చికిత్స కోసం మోల్నుపిరావిర్ ను విడుదల చేసింది.80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వయోజన రోగుల కోసం మోల్నుపిరావిర్‌ను ఆమోదించింది. ఈ మెడిసిన్ కు షరతులతో కూడిన ఆమోదం లభించింది. ఇటీవల ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు రోగి మరణ ప్రమాదం ఉన్నట్లయితేనే ఈ మోల్నుపిరావిర్ ఇవ్వాలని క్లినికల్ డేటా యొక్క సమీక్ష తర్వాత Drugs Controller General of India (DCGI’ ఆమోదించింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనార్హం.

మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన 13 కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్‌ సంస్థ మోల్‌కోవిర్‌ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని గురువారం (డిసెంబర్ 30,2021) హైదరాబాద్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా మెల్నుపిరావిర్‌ని రేపోమాపో మార్కెట్‌లోకి తేవాలని ఆయా కంపెనీలు కూడా యుద్ధప్రతిపాదికన యత్నిస్తున్నాయి.

Read more : US womanRajasthan Omicron : రాజస్థాన్‌లో ఒమిక్రాన్ మరణం.. కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతి Covid : విమానంలో మహిళకు పాజిటివ్…బాత్రూంలోనే ఉండిపోయింది

కాగా రకరకాలుగా మారి కరోనా రెండేళ్లుగా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ముఖాలు కనిపించకుండా మాస్కులు పెట్టుకునేలా చేస్తోంది. కరోనా ప్రమాదం తప్పిందనుకునే సమయంలో మరోసారి ఒమిక్రాన్‌ గా వ్యాప్తినే మరోవైపు థర్డ్‌ వేవ్‌ భయాలు రేకెత్తిస్తోంది. ఈక్రమంలో కరోనాకి విరుగుడుగా మోల్నుపిరావిర్‌ ఔషధం అందుబాటులోకి రావడం అదికూడా ముందుగా హైదరాబాద్‌లో అందుబాటులోకి రావటం మంచివార్త అనే చెప్పాలి.

Read more : US woman Covid : విమానంలో మహిళకు పాజిటివ్…బాత్రూంలోనే ఉండిపోయింది