US woman Covid : విమానంలో మహిళకు పాజిటివ్…బాత్రూంలోనే ఉండిపోయింది

మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు...

US woman Covid :  విమానంలో మహిళకు పాజిటివ్…బాత్రూంలోనే ఉండిపోయింది

Mid Air

Covid-Positive Mid-Air : ప్రపంచాన్ని కరోనా ఇంకా భయపెడుతోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలుగుతోంది. తగ్గుముఖం పడుతుందని అనుకున్న క్రమంలో..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకపడుతోంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు రికార్డవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి..విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్ పోర్టు సిబ్బంది కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ గా తేలితే..వెంటనే హోం ఐసోలేషన్ కు పంపిస్తున్నారు. అదే విమానం ఎక్కిన తర్వాత..పాజిటివ్ అని తేలితే…?

Read More : Non Veg Goat : చికెన్, మటన్ తినే మేక..ఆకులవైపు కన్నెత్తి కూడా చూడదట..

డిసెంబర్ 19వ తేదీన చికాగో నుంచి ఐస్ లాండ్ కు 150 మంది ప్రయాణీకులతో ఓ విమానం బయలుదేరింది. ప్రయాణీకులకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. నెగటివ్ వచ్చిన వ్యక్తులను ఫ్లైట్ లో ఎక్కేందుకు అనుమతించారు. వారిలో మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు.

Read More : US Covid Cases : అమెరికాలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 5లక్షల 80వేల కేసులు

గొంతులో నొప్పి..తదితర కారణాలతో అసౌకర్యంగా కనిపించారు. దీంతో సిబ్బంది..ప్రయాణంలోనే టెస్టులు నిర్వహించారు. ఆమెకు పాజిటివ్ రావడంతో విమానంలో కలకలం రేగింది. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆమె బాత్ రాం వైపుకు వెళ్లిపోయారు. దాదాపు 5 గంటల పాటు బాత్ రూంలోనే స్వీయ నిర్భందంలో ఉండిపోయారు. బాత్ రూంలో నరకయాతన అనుభవించానని, ఎదురైన దారుణ పరిస్థితిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.