US first covid pill : కోవిడ్‌ చికిత్సలో మరో అడుగు..తొలి టాబ్లెట్‌కు ఆమోదం..

కరోనా చికిత్సలో మరో కీలక ఘట్టం ఆవిష్కరింపబడింది కోవిడ్‌ చికిత్సలో తొలి టాబ్లెట్‌కు ఆమెరికా ఆమోదం పలికింది.

US first covid pill : కోవిడ్‌ చికిత్సలో మరో అడుగు..తొలి టాబ్లెట్‌కు ఆమోదం..

Us First Covid Pill

US first covid pill : కరోనా మహమ్మారి. రెండేళ్లుగా ఎక్కడ విన్నా ఇదే మాట. ఒకరిమొహాలు మరొకరు చూడలేని పరిస్థితి. మాస్కులు తప్పనిసరి అయ్యాయి. ఈ మహమ్మారిని నియంత్రించటానికి శాస్త్రవేత్తల కృష్టికి ఫలితంగా వ్యాక్సిన్లు వచ్చాయి. రెండు మూడు డోసులుగా వ్యాక్సిన్లు వేయించుకోవటం జరుగుతోంది. కానీ టీకా కంటే ఓ మాత్ర వస్తే బాగుండు అనుకున్నాం. దాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు శాస్త్రవేత్తలు. కోవిడ్ చికిత్సకు ‘తొలి మాత్ర’ వచ్చేసింది. దీనికి అమెరికా ఆమోదం కూడా పలికింది. దీంతో కరోనా మహమ్మారి చికిత్సలో టాబ్లెట్‌ కూడా చేరింది…ఈ మాత్రకు ఆమోదం లభించటంతో..కరోనా వైరస్ పై మానవుడు సాగిస్తోన్న పోరాటం ఇవాళ మరో మైలురాయిని దాటినట్లైంది.

Read more : Omicron Cases : తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రకు అనుమతి ఇచ్చింది.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈరోజు తొలి కోవిడ్ పిల్ కు ఆమోదముద్ర వేసింది. కోవిడ్ చికిత్సలో ఎమర్జన్సీగా వినియోగించటానికి ఫైజర్ సంస్థ రూపొందిన టాబ్లెట్లకు అనుమతినిచ్చింది అమెరికా. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా..తయారీ, పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వ్యాక్సిన్లు స్టోర్ చేయాలంటే తగిన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. అలా కొన్ని ఇబ్బందులు రావటంతో చాలా వ్యాక్సిన్ల డోసులు నిరుపయోగమైన ఘటనలు లేకపోలేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి టీకాలు అందడం కష్టంగా మారింది. కానీ కోవిడ్ మాత్రతో ఆ ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. ట్యాబ్లెట్ కావట్టి దాన్ని పంపిణీ చేయటం చాలా సులువు. పైగా స్టోర్ చేయాల్సిన పని కూడా ఉండదు. కేవలం నిర్ణీత గడువులోగా దాన్ని వాడితే సరిపోతుంది. ఏది ఏమైనా వ్యాక్సిన్ కంటే ట్యాబ్లట్ పంపణి చాలా సులవనే చెప్పాలి. అలా దాన్ని వినియోగించటం కూడా సులువే.

కాగా..సౌతాఫ్రికాకలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త సమస్యగా తయారైంది.వ్యాక్సిన్‌పై ఎంత ప్రచారం చేసినా.. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌కు అందరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు కోవిడ్ చికిత్సలో చేరిన తొలి టాబ్లెట్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలున్నాయి.

Read more : Omicron Variant: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పరీక్షలు జరపండి – హైకోర్టు

తీవ్రమైన కోవిడ్-19 లక్షణాలున్నవారికి ఈ ట్యాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చని ఎఫ్డీఏ యూఎస్ లోని ఆయా ఆస్పత్రులకు సూచించింది. ఇప్పటికే కోటికిపైగా ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశామని..ఈ వారాంతంలోనే రోగులకు కొవిడ్ పిల్స్ అందుబాటులోకి వస్తాయని ఫైజర్ ఫార్మా సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా వెల్లడించారు. ఎఫ్డీఏ అనుమతి తర్వాత సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆమోదంతో ఫైజర్ వారి పాక్స్‌లోవిడ్ కొవిడ్ ట్యాబ్లెట్ల పంపిణీ వేగవంతం కానుంది.

ఇక భారత్ విషయానికొస్తే..అమెరికాలో కొవిడ్ చికిత్సకు తొలి ట్యాబ్లెట్ అనుమతి పొందిన క్రమంలో అధిక జనాభాగల భారత్ లోనూ ట్యాబ్లెట్ల వాడకంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇండియాలోనూ కొవిడ్ పిల్స్ కు అనుమతిచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి కొవిడ్ ట్యాబ్లెట్ గా రికార్డులకెక్కిన అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ వారి ‘మోల్నూపిరావిర్’ మాత్రను అత్యవసర వినియోగం కింద బ్రిటన్ గత నెలలో ఆమోదించింది. భారత్‌లోనూ మోల్నూపిరావర్ మాత్రను అత్యవసర వినియోగం కింద అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయని సీఎస్ఐఆర్ కోవిడ్ స్ట్రాటజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామ్‌ విశ్వకర్మ తాజాగా వెల్లడించారు. ఇప్పుడు ఫైజర్ మాత్ర పాక్స్‌లొవిడ్ కు అమెరికా ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ రెండిటికీ భారత్ కూడా అనుమతించే అవకాశాలున్నాయి.