Chandrababu : నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రద్దు చేయాలి

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాలకు..

Chandrababu : నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రద్దు చేయాలి

Chandrababu

Chandrababu : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాలడ్పిన అధికారులపై విచారణ చేపట్టాలన్నారు.

KCR : త్వరలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. నెల్లూరు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలిపారు. గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే తుది జాబితా ప్రకటించడం లేదా? అని ప్రశ్నించారు.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు..

విపక్ష నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారని తెలిపారు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, దినేశ్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన రిటర్నింగ్ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు.