KCR : త్వరలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

KCR : త్వరలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

Kcr Jobs

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సోమవారం ప్రగతి భవన్‌ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. మరికొద్ది రోజుల్లోనే 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడేళ్లలో ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు.

FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

త్వరలో మరో 70-80వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కేంద్రం లాగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఏడాదికి కోటి ఉద్యోగాలను తొలగించలేదన్నారు. దేశంలో నిరుద్యోగం తక్కువ గల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. నిరుద్యోగులు ఆందోళనకు గురి కావొద్దన్న కేసీఆర్, ఇక నుంచి ప్రతి ఏటా ఎంప్లామెంట్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశామని, నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరిస్తామన్న కేసీఆర్.. ఉద్యోగుల కోసమే అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నూతన జోనల్ వ్యవస్థలో సర్ధుబాటు చేశామని, ఇప్పటివరకు 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏ జిల్లాకి చెందిన వారు ఆయా జిల్లాల్లో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యోగాలిచ్చాము కాబట్టే తెలంగాణలో నిరుద్యోగత రేటు తక్కువగా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడనేది మీ కేంద్ర మంత్రులను అడుగు అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పురోగతి ఏ బీజేపీ పాలిత రాష్ట్రం సాధించింది? అని కేసీఆర్ బండి సంజయ్ ను ప్రశ్నించారు. బీజేపీ ఏ వర్గ ప్రజలకు మేలు చేసిందో చెప్పాలన్నారు.