Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

కొత్త వింత.. పాత రోత అన్నట్లు టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే అప్ డేట్ లేకుండా అలాగే ఉండిపోతుందే అప్పుడు బోర్ కొట్టేస్తుంది. వినియోగదారులకు అలా బోర్ కొట్టకూడదని....

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

Whatsapp Delete

Whatsapp: కొత్త వింత.. పాత రోత అన్నట్లు టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే అప్ డేట్ లేకుండా అలాగే ఉండిపోతుందే అప్పుడు బోర్ కొట్టేస్తుంది. వినియోగదారులకు అలా బోర్ కొట్టకూడదని లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తూ అప్ డేటెడ్ గా ఉంటుంది వాట్సప్. రీసెంట్ గా మరో ఫీచర్ ను యాడ్ చేసింది. 2017లో వాడుకలోకి వచ్చిన ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్‌ను మరింత అడ్వాన్స్ చేసింది.

ఒకరి నుంచి మరొకరికి పంపించుకున్న మెసేజ్.. డిలీట్ చేయాలనుకుంటే ఇద్దరి మొబైల్స్ లోనూ ఒకేసారి తీసేయొచ్చు. ఈ ఫీచర్ కొద్ది నిమిషాలే ఉండేది. ఆ తర్వాత దాన్ని గంటా 8 నిమిషాలకు పెంచారు. ఇప్పుడు అంతకుమించిన సమయం కోసం రెడీ చేస్తున్నారు. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఆండ్రాయిడ్ కొత్త బీటా వెర్షన్ 2.21.23.1లో ఈ టైమ్ లిమిట్ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన అప్‌డేట్ కనిపించింది. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్.. టెస్టింగ్ పూర్తయ్యాక అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ అప్‌డేట్‌లో వినియోగదారులు మెసేజ్ పంపాక ఎప్పుడైనా మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చన్న మాట. మెసేజ్ చేసిన మూడు నెలల తర్వాత కూడా డిలీట్ చేయొచ్చు.

T20 World Cup 2021: నలుగురు అఫ్ఘాన్ల చేతిలో టీమిండియా సెమీస్ ఆశలు

డెవలప్‌మెంట్‌లోనే ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తుందా లేక పాలసీ ప్రకారం.. స్క్రాప్ చేస్తుందా అని తెలియాల్సి ఉంది. దీనిపై అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకటించలేదు.

ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా వాట్సాప్ ఇస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయ్యే ఫోన్లు, పిక్సెల్ ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.