Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు..

మామిడి ఆకుల మిశ్రమాన్ని తీసుకుంటూ డయాబెటిస్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మామిడాకులను నీళ్ళలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు..

Mango Leaves

Mango Leaves : పండ్లలో రుచికరమైనది మామిడి పండు. వేసవికాలంలో వీటిని తినని వారుండరు. మామిడి చెట్ల నుండి వచ్చే ఈ పండ్లు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే మామిడి ఆకుల వల్ల ఎన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయన్న విషయం చాలా మందికి తెలియదు. మామిడి మామిడిఆకుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పుష్కలంగా వున్నాయి.కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ ఫెవనాయిడ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ …అబ్బో ఇకా మరెన్నో న్యూట్రీసియన్స్ దాగున్నాయి.

మామిడి ఆకులలో విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్దాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందికి డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఇప్పుడు మనిషి జీవన శైలిలో ఒక భాగమైంది. దీని చికిత్స లో మామిడాకులు ఔషధంగా పనిచేస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. మామిడాకులు మధుమేహా లక్షణాలైన అధిక బరువు, రాత్రి తరచుగా మూత్ర విసర్జన చేయడం, దృష్టి మసక బారడం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని ఇతర స్టడీలు కూడా చెబుతున్నాయి.

వివిధ రకాల రుగ్మతలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండే మామిడి ఆకులను ఆయుర్వేద వైద్యశాస్త్రంలో వాడతారు. మామిడి ఆకులును నీళ్లలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి ఆకులు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కు కారణమయ్యే హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. రోజూ ఒక కప్పు మ్యాంగో లీవ్స్ టీ తాగడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రెస్ నుండి బయటపడాలంటే పచ్చి మామిడి ఆకులను మరిగించిన టీని తాగడం వల్ల డిఫెరెన్స్ ను ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ టీ నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది.

డాక్టర్ సలహా మేరకు మామిడి ఆకుల మిశ్రమాన్ని తీసుకుంటూ డయాబెటిస్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మామిడాకులను నీళ్ళలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తాజా మామిడి ఆకులు తీసుకొని వాటిని 150మి.లీ.నీటిలో వేయండి. ఇలా రాత్రంతా నీటిలోనే ఉంచండి. ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ముందు ఆ నీటిని తాగండి. ఇలా ప్రతి రోజూ పరగడుపున ఈ నీళ్ళను మూడు నెలల పాటు తాగండి. మామిడి ఆకుల నీళ్ళను తాగడం వల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు. రోజుకు కప్పు మామిడాకుల టీ తాగడం మర్చిపోకండి. అన్ని రకాల శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో మామిడాకుల టీ గొప్పగా సహాయపడుతుంది.

డయాబెటిస్ ను తగ్గించటంలోనూ మామిడాకులు బాగా పనిచేస్తాయి. ఇన్సులిన్ శాతాన్ని మెరుగుపరిచి గ్లూకోజ్ డిస్ట్రిబ్యూషన్ ను పెంచుతాయి. ఫలితంగా రక్తంలో చక్కెర లెవెల్స్ స్దిరంగా ఉంటాయి. శరీరంలో హానికరమైన కొవ్వుశాతాన్ని తగ్గించి డయాబెటిస్ లక్షణాలకు దూరంగా ఉంచుతాయి.ఆస్తమా లాంటి ఇతర సమస్యలను దూరం చేస్తుంది. మ్యాంగో లీఫ్ జ్యూస్ ను లైట్ గా వేడి చేసి, ఒకటి రెండు చుక్కలు చెవిలో వేసుకోవడం వల్ల అద్బుతంగా పనిచేసి, నొప్పిని తగ్గిస్తుంది. కాలిన గాయాలను మామిడి ఆకులు గొప్పగా మాన్పుతాయి. మ్యాంగో లీవ్స్ ను కాల్చాలి, కాల్చిన మామిడి ఆకలు పొడి ని కాలిన గాయాల మీద చల్లితే చాలు త్వరిత ఉపశమనం కలుగుతుంది. మామిడాకుల్లో ఔషధ గుణాలతో పాటు వైద్య లక్షణాలు చాలా వున్నాయి. వీటిని మూలికలతో పాటు ఈస్టర్న్ మందుల్లో కూడా వాడతారు.