BAC Meeting : టీడీపీ సభ్యులు గవర్నర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వలేదు-సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.  స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగం సమ

BAC Meeting : టీడీపీ సభ్యులు గవర్నర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వలేదు-సీఎం జగన్

Bac Meeting Amaravati

BAC Meeting : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.  స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ నినాదాలు.. గత అసెంబ్లీలో చంద్రబాబు టార్గెట్టుగా జరిగిన పరిణామాల ప్రస్తావనపై చర్చ జరిగింది.

టీడీఎల్పీ  ఉపనేత అచ్చెన్నాయుడు సమావేశానికి రాగానే సీఎం జగన్ అచ్చెన్న కమింగ్ బ్యాక్ అంటూ చమత్కరించారు.  కమింగ్ బ్యాక్ ఏముందని.. అసెంబ్లీ ఉంటే రావాలి కదా అని అచ్చెన్నాయుడు రిప్లై ఇచ్చారు.  అసెంబ్లీలో స్పీకర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడటంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరం తెలపడం ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయంటూ అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

రాజ్యాంగ  హోదాలో  ఉన్న గవర్నరును అవమానించేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని… చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని.. గవర్నర్ వయస్సు కూడా గౌరవం ఇవ్వలేదంటూ సీఎం జగన్ అసహనంవ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరం తెలపడం ఇదే మొదటిసారి కాదని అచ్చెన్న చెప్పగా…. అందుకు జగన్ సమాధానమిస్తూ…నేనెప్పుడూ ఈ విధంగా చేయలేదని.. నిరూపిస్తే రాజీనామా చేస్తాను అన్నారు.
Also Read : Tirumala : ఏప్రిల్ 1 నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు పునరుధ్ధరణ
మీరు అలా చేశారనలేదని.. నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని చెబుతునానన్న అచ్చెన్న ప్రతి సమాధానం చెప్పారు.  సభలో టీడీపీ సభ్యులు అబద్దాలు మాట్లాడుతున్నారంటూ సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయగా…మేం చెప్పాల్సింది చెబుతాం.. మా వాదనలో ఏమైనా తప్పుంటే మంత్రులు దాన్ని సరి చేయొచ్చన్న అచ్చెన్న అన్నారు.

ఇంతలో ఆర్ధిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాధ్ మాట్లాడుతూ …సభలో టీడీపీ సభ్యులు అడ్డగోలు అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఏం మాట్లాడారో రాత్రి పడుకునే ముందు వీడియోలు చూడాలంటూ బుగ్గనకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు.
Also Read : AP Covid Cases : ఏపీలో కొత్తగా 61 కరోనా కేసులు
గత సమావేశంలో చంద్రబాబును తామెవరం ఏమీ అనకున్నా.. బయటకెళ్లి తామెదో అన్నట్టుగా చిత్రీకరించారని …. రికార్డులు మొత్తం చూసినా ఎక్కడా కనబడలేదని సీఎం వెల్లడించారు. రికార్డుల్లో అవన్నీ ఉండవని.. రన్నింగ్  కామెంటరీ చేస్తే రికార్డుల్లో ఎలా ఉంటుందని అచ్చెన్న సమాధానం చెప్పారు. కావాలంటే తామూ రికార్డులిస్తామన్న అచ్చెన్న చెప్పారు. ఈవిధంగా పలు విషయాలపై సీఎం జగన్, బుగ్గన, అచ్చెన్నాయుడుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది.