AP Covid Cases : ఏపీలో కొత్తగా 61 కరోనా కేసులు

ఏపీలో కరోనావైరస్(AP Covid Cases) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7వేల 547 కరోనా పరీక్షలు..

AP Covid Cases : ఏపీలో కొత్తగా 61 కరోనా కేసులు

Ap Corona Cases

AP Covid Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7వేల 547 కరోనా పరీక్షలు నిర్వహించగా, 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు వెలుగు చూశాయి. విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 237 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి ఒక్క కరోనా మరణం కూడా సంభవించ లేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,478 మంది కరోనా బారినపడగా, వారిలో 23,02,862 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 887 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14వేల 729 మంది కరోనాతో మరణించారు. నేటివరకు రాష్ట్రంలో 3,31,89,416 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 79 కరోనా కేసులు వచ్చాయి.

AP Covid Cases : ఏపీలో కరోనా ఖతమ్..! భారీగా తగ్గిన కేసులు, సున్నా మరణాలు

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోయింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. 2020 మే నాటి కనిష్ఠానికి చేరాయి. గడిచిన 24 గంటల్లో 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4వేల 362 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. థర్డ్ వేవ్ కి కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తగ్గుతుండటంతో కేసులు భారీగా క్షీణిస్తున్నాయి. మరోవైపు మరణాల సంఖ్యా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. అంతకుముందు రోజు 150కిపైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 100 దిగువకు చేరింది. 24 గంటల వ్యవధిలో 66 మంది మృతి కోవిడ్ తో మరణించారు. దేశంలో ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5.15 లక్షల మంది కోవిడ్ తో మరణించారు.(AP Covid Cases)

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 54,118కి తగ్గాయి. మొత్తం కేసుల్లో కొవిడ్ బాధితులు 0.13 శాతం. రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. నిన్న 9,620 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్రం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(AP Covid Cases)

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గింది. కేసులు దిగివచ్చాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

దశల వారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి.. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది. కరోనా మొదలైన నాటి నుంచి కాలానుగుణంగా అది చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసి.. పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.