Krishna : తల్లితో సహజీవనం‌ చేస్తూనే..ఆమె కూతురిపై 10 నెలలుగా అత్యాచారం

దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.

Krishna : తల్లితో సహజీవనం‌ చేస్తూనే..ఆమె కూతురిపై 10 నెలలుగా అత్యాచారం

Girl Rape

Man rapes girl : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మానవ మృగంగా మారిన తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతూరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి ఆమెపై 10 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.

దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక వయసు 17 సంవత్సరాలు.

Girl Rape : బాలికపై అత్యాచారం..రేపిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష!

కోమటి‌ సురేష్ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.