Girl Rape : బాలికపై అత్యాచారం..రేపిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష!

బాలికపై అత్యాచారం కేసులో రేపిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

Girl Rape : బాలికపై అత్యాచారం..రేపిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష!

Girl Rape

Girl Rape : అభం శుభం తెలియని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం (డిసెంబర్ 8,2021) తీర్పునిచ్చింది. పోక్సో కేసు ప్రత్యేక న్యాయమూర్తి జి.ప్రేమలత జైలుశిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా కూడా విధించారు. 2016 లో హైదరాబాద్ నగరంలోని కవాడిగూడ సింగాడికుంటకు చెందిన ఆకుల రాము అనే 29 ఏళ్ల యువకుడు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుసార్లు అత్యాచారానికి పాల్పడగా బాలిక గర్భం దాల్చింది.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

దీంతో కూతుర్ని నిలదీయటంతో అసలు విషయం చెప్పింది.దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ..ఈనాటికి తీర్పు వచ్చింది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువరిస్తు..తీర్పును వెలువరించారు. కాగా అత్యాచారం వల్ల బాలికకు మగపిల్లాడు జన్మించినా ఆ శిశువు మృతిచెందాడు. పుట్టిన శిశువు డీఎన్‌ఏ సేకరించి నిందితుడి డీఎన్‌ఏతో పోల్చి..పక్కాగా సరిపోయాయి. ఈ కేసు విషయంలో పోలీసులు అన్ని ఆధారాలు ప్రాసిక్యూషన్‌ ముందు నిరూపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

Read more : Students Sentenced : తోటి విద్యార్థిని హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించిన కోర్టు