Students Sentenced : తోటి విద్యార్థిని హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించిన కోర్టు

2019లో బంగ్లాదేశ్ యూనివర్శిటీలో తోటి విద్యార్థిని హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు కోర్టు మరణశిక్ష విధించింది.

Students Sentenced : తోటి విద్యార్థిని హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించిన కోర్టు

Bangladesh 20 Students Death Sentence (1)

Bangladesh 20 students death sentence: 2019లో బంగ్లాదేశ్ యూనివర్శిటీ ఆఫ్ ఇంజీనిరింగ్ అండ్ టెక్నాలజీలో కొంతమంది విద్యార్దులు తోటి విద్యార్థిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసులో బంగ్లాదేశ్ ట్రయల్ కోర్టు 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించింది. మరో ఐదుగురికి  బుధవారం (డిసెంబర్ 8,2021) యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తు తీర్పును వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలో అబ్రార్ ఫహాద్ అనే 21 ఏళ్ల విద్యార్ధిని చంపిన కేసులో రెండేళ్లలో ట్రయల్ కోర్టు శిక్షను ఖారు చేస్తు సంచనల తీర్పును వెల్లడించింది.

బంగ్లాదేశ్ లోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (BUET)లో రెండో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి అబ్రార్ ఫహద్‌ను 2019 అక్టోబర్ 7న ఛత్ర లీగ్ విద్యార్థి సంఘం సభ్యులుగా ఉన్న 25 మంది BUET విద్యార్థులు కొట్టి చంపారు. అబ్రార్ ఫహద్‌ను జమాతే-ఈ-ఇస్లామీకి చెందిన స్టుడెంట్ ఫ్రంట్​ కార్యకర్తగా అనుమానించి తాళ్లతో కట్టేసి క్రికెట్ బ్యాట్ లతో అత్యంత దారుణంగా కొట్టటంతో ఫహాద్ చనిపోయాడు. ఈ కేసులో 21మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

అబ్రార్ ఫహద్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్​బుక్​ పోస్ట్ పెట్టాడని ఛత్ర లీగ్ విద్యార్థి సంఘం సభ్యులు ఫహాద్ ను కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసులో బంగ్లాదేశ్ ట్రయల్​​ కోర్టు సంచలన తీర్పునిస్తు 20 మంది విద్యార్థులకు మరణశిక్ష..మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పు వెల్లడించిన సందర్భంగా న్యాయమూర్తి  అబూ జాఫర్ ఎండీ కమ్రుజ్జమాన్ పలు కీలక వ్యాఖ్యలు చేస్తు..‘‘మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని విద్యార్ధులు శ్రద్ధగా చదువుకోవాలి తప్ప ఇటువంటి నేరపూర్తి పనులకు పాల్పడకూడదు’అని అన్నారు. ఈ శిక్షను విధించినట్లు పేర్కొంది కోర్టు. కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందుతుల తరపు డిఫెన్స్ లాయర్లలో ఒకరైన ఫరూక్ అహ్మద్ ఈ శిక్షలపై పై కోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు.

కోర్టు ఇచ్చిన తీర్పుని మృతుడి తండ్రి బర్కత్ ఉల్లా సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన నా కొడుకు తిరిగి రాడు…కానీ ఈ తీర్పు మా కుటుంబానికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుందని..దోషుల తరపు లాయర్ పైకోర్టుకు వెళతానని అంటున్నారని..అక్కడ కూడా వారికి కఠిన శిక్ష పడాలని తాము కోరుకుంటున్నామని కన్నీటితో తెలిపారు.

Read more : 20ఏళ్లు జైలు శిక్ష : బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

దోషులు బంగ్లాదేశ్​ యూనివర్శిటీ ఆఫ్ ఇంజనీరింగ్​ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు. అధికారంలో ఉన్న అవామీ లీగ్​ స్టుడెంట్​ ఫ్రంట్​ బంగ్లాదేశ్ ఛత్ర లీగ్​ (BCL)కు చెందిన కార్యకర్తలు. 2019లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్​బుక్​ పోస్ట్ పెట్టిన సెకండ్ ఇయర్ విద్యార్థి అబ్రార్​ ఫహాద్ ను జమాతే-ఈ-ఇస్లామీకి చెందిన స్టుడెంట్ ఫ్రంట్​ కార్యకర్తగా అనుమానించి హత్యకు పాల్పడ్డారు.

Read more : వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు

హత్య జరిగిన తరువాత సదరు విద్యార్ధుల సభ్యత్వాన్ని బీసీఎల్ రద్దు చేసింది బీసీఎల్​. హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బయటికి రావడం వల్ల బంగ్లాదేశ్​ అంతటా ఆందోళనలు వెల్లువెత్తాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్స్ వచ్చాయి. ఈ హత్యపై ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేక స్వతంత్ర్య దర్యాప్తు జరిపించనున్నట్లు అప్పట్లో తెలిపింది. దీంతో ఈ హత్య అంతర్జాతీయ అంశంగా మారిపోయింది. ప్రస్తుత తీర్పు పట్ల బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కానీవారు పైకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా వారికి తగిన శిక్ష పడాలని కోరారు.