Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసుని తొమ్మిది రోజుల్లో విచారణ చేసి దోషికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

Jaipur Court (1)

Jaipur girl Rape case ..Judgment in 9 days..Gets 20 Years In Jail : అత్యాచారాల కేసుల్లో తీర్పులు చాలా ఆలస్యమవుతుంటారు. కానీ ఓ చిన్నారిప జరిగిన అత్యాచారం కేసులు కోర్టు కేవలం తొమ్మిది రోజుల్లో తీర్పునివ్వటం అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రూ.20సంవత్సరాల జైలుశిక్ష విధించటం ఓ సంచలనంగా మారింది. సాధారణంగా అత్యాచారం కేసుల విచారణలు..చాలా ఏళ్లు పట్టేస్టాయి. కారణం భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం 100మంది నేరస్థులు తప్పించుకున్నా ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే విధానం వల్ల. కానీ రాజస్థాన్ లో మాత్రం ప్రత్యేక కోర్టు తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కేవలం తొమ్మిది రోజుల్లో తీర్పుని వెల్లడించటం గమనించాల్సిన విషయం.

రాజస్తాన్‌లోని బాలికపై జరిగిన అత్యాచారం కేసుని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై 25ఏళ్ల కమలేశ్‌ మీనా అనే వ్యక్తి సెప్టెంబర్‌ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు హుటాహుటిన రంగరంలోకి దిగారు. అత్యాచారం జరిగిన మరుసటిరోజు ఉదయమే నిందితుడిని అరెస్టు చేయటం అనంతరం ఏమాత్రం ఆలస్యం చేకుండా కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేయటం..కేసుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి కోర్టులో చార్జిషీటు దాఖ లు చేయటం అంతా వెంట వెంటనే జరిగిపోయాయి.

Read more : 20ఏళ్లు జైలు శిక్ష : బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

అలా..చలాన్‌ నమోదైన ఐదు వర్కింగ్ డేస్ లోనే జైపూర్‌ మెట్రోపాలిటన్‌ సిటీ పోక్సో 3వ నంబర్‌ కోర్ట్‌ సంచలన తీర్పును వెల్లడించింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి బాలిక అత్యాచారం కేసులో దోషిగా తేలింది. దీంతో న్యాయమూర్తి వికాష్ కుమార్ దోషి కమలేశ్‌కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చారు.

ఈ సంచలన కేసు విషయంలో జైపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ హరేంద్ర కుమార్‌ మాట్లాడుతు..తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన ఈ అత్యాచార ఘటన తీవ్రమైనది. అందుకే నిందితుడిని పట్టుకోవటానికి 150మంది పోలీసులు పలు బందాలుగా ఏర్పాటు చేసి మరుసటిరోజు ఉదయానికి పట్టుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.

Read more : వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు

నిందితుడిని అంత త్వరగా పట్టుకోవటంలో మా పోలీసులు సమిష్టిగా కృషి చేశారని అతి తక్కువ సమయంలోనే చార్జ్ షీట్ దాఖలు చేయటానికి కావాల్సిన అన్ని సాక్ష్యాలను సేకరించారని డిప్యూటీ కమిషనర్‌ హరేంద్ర కుమార్‌ పోలీసులను ప్రశంసించారు.