Ramgopal Reddy-MLC Elections 2023: ఉత్కంఠకు తెర.. రాంగోపాల్ రెడ్డికి కలెక్టర్ డిక్లరేషన్ అందజేత

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాంగోపాల్ రెడ్డికి ఇవాళ కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఇచ్చారు. నిన్నే ఫలితాలు వెలువడినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత చెలరేగిన విషయం తెలిసిందే. రిటర్నింగ్‌ అధికారులపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

Ramgopal Reddy-MLC Elections 2023: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాంగోపాల్ రెడ్డికి ఇవాళ కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఇచ్చారు. నిన్నే ఫలితాలు వెలువడినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత చెలరేగిన విషయం తెలిసిందే. రిటర్నింగ్‌ అధికారులపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

గత అర్ధరాత్రి కౌంటింగ్‌ కేంద్రం దగ్గర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు రాంగోపాల్‌రెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. రీకౌంటింగ్ నిర్వహిస్తారా? అన్న సందేహాలూ వచ్చాయి. చివరకు ఇవాళ రాంగోపాల్ రెడ్డికి కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలవ శ్రీనివాసులు, పార్ధసారథి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

కాగా, గత అర్ధరాత్రి చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడిపడుతూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతారా? అంటూ సీఎం జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందుల టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచారని అక్కసుతో ఆర్ధరాత్రి అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరాలని అన్నారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది.

AP MLC Election Results 2023 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్.. పశ్చిమ రాయలసీమలోనూ విజయం

ట్రెండింగ్ వార్తలు