Snake : వామ్మో.. వాషింగ్ మెషీన్‌లో నాగుపాము.. బట్టలు వేద్దామని డోర్‌ తెరవగా..

పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో

Snake : వామ్మో.. వాషింగ్ మెషీన్‌లో నాగుపాము.. బట్టలు వేద్దామని డోర్‌ తెరవగా..

Snake

Snake : పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా. పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి కదా.

Booster Dose: బూస్టర్ డోస్‍‌లు అవసరం లేదని చెబుతున్న సైంటిస్టులు

తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లో దూరిన ఓ నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేద్దామని దాని డోర్‌ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ వర్మకు సమాచారం ఇచ్చారు. అతడొచ్చిచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

VK Paul : 2022 ఏడాదిలోనూ మాస్క్ ధరించడం మానొద్దు!

ఆ మహిళ అదృష్టం బాగుందని నెటిజన్లు అంటున్నారు. పొరపాటున పాము కాటు వేసి ఉంటే, ఆమె పరిస్థితి ఏమై ఉండేదోనని అంటున్నారు. కాగా, ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సరాసరి వాషింగ్ మెషీన్ లోకి దూరింది.